ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అధికారం ఇచ్చింది… ప్రభుత్వానికి సంబంధించిన వాటన్నింటిపై వైఎస్ పేర్లు పెట్టుకోమని అన్నట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం .. విజయనగరం జిల్లాలోని మహారాజా ప్రభుత్వ ఆస్పత్రి పేరును కూడా మార్చేసింది. అయితే దీనికి వైఎస్ పేరు పెట్టలేదు. పెడుతూ ఏమైనా రహస్య ఉత్తర్వులు జారీ చేశారమో కొన్నాళ్లు ఆగితే తెలియదు కానీ ఇప్పటికే పేరు మార్చేశారు. మహారాజా పేరు తీసేసి ప్రభుత్వ సర్వ జన ఆస్పత్రి అని పేరు మీదనే కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
విజయనగరం జిల్లా పేదలకు వైద్యం అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రి ఉన్న స్థలం మొత్తం పూసపాటి వంశీయులు విరాళంగా ఇచ్చారు. అయితే ఆ వంశీకుల పేర్లు పెట్టలేదు. ప్రజలు అందరూ ఎంతో అభిమానంగా ఆ కుటుంబీకులను మహారాజా వారు అని పిలుచుకుంటారు. అందుకే మహారాజా ఆస్పత్రి అని పేరు పెట్టారు. నిజానికి ఒక్క ఆస్పత్రి మాత్రమే కాదు.. మహారాజా కాలేజీలు.. మహారాజా స్కూల్స్.. మహారాజా ఆస్పత్రులు.. ఇలా విజయనగరం జిల్లాలో ప్రజోపయోగ సంబంధమైన ప్రతీ దానికి భూములు మహారాజా వారు ఇచ్చినవే. అలాంటి పూసపాటి వంశీకులపై జగన్ కక్ష సాధిస్తున్నారు.
పేర్లు తీసేసి వైఎస్ పేరు పెట్టుకుంటే.. అందరూ పాతవి మర్చిపోతారని.. వైఎస్ కట్టారని.. వైఎస్ దానం చేశారని అనుకుంటారని జగన్ అనుకుంటున్నారమోనన్న సెటైర్లు రాజకీయవర్గాల్లో పడుతున్నాయి. పూసపాటి వంశీకులు అక్కడి ప్రజలకు చేసిన.. చేస్తున్న సాయాల గురించి కనీస అవగాహన లేకుండా చేస్తున్న ప్రయత్నమేనని అంటున్నారు. గతంలో పూసపాటి అశోక్ గజపతిరాజును ఘోరంగా అవమానించారు. బూతులు తిట్టించారు. ఇప్పుడు మహారాజా పేరును కూడా ఉంచడానికి వారి మనసు ఒప్పుకోవడం లేదు.