నిజానికి అది చిరంజీవి గౌరవాన్ని నిలబెట్టి న ఘటన. ఆయన వ్యక్తిత్వం గొప్పదని అందరికీ చూపించిన ఘటన. కానీ నాగబాబు వల్ల మొత్తం తేడా కొట్టింది. కుల గొడవలకు కారణం అయింది. రెండు కులాలు సోషల్ మీడియాలో పోట్లాడుకోవడానికి వేదిక అయింది. ఇదంతా నాగబాబు వల్లే జరిగింది.
అలయ్ – బలయ్ ప్రోగ్రాంలో చిరంజీవి అతిధులతో సెల్ఫీలు దిగే ప్రోగ్రాం పెట్టుకోవడంతో గరికపాటి నరసింహారావు ప్రవచానికి ఆటంకం ఏర్పడింది. దీంతో గరికపాటి కాస్త అసహనానికి గురయ్యారు. ఆ ఫోటో సెషల్ ఆపేయాలని సూచించారు. దీంతో చిరంజీవి కూడా జరిగిన అసౌకర్యానికి చింతించి.. గరికిపాటికి గౌరవం ఇచ్చారు. ఇక్కడ గరికపాటి అసహనానికి గురయ్యారని అందరూ అంగీకరిస్తారు. చిరంజీవి మెగాస్టార్. ఆయనతో ఫోటోల కోసం అందరూ ఎగబడతారు.. అది కామన్. అందులో చిరంజీవి తప్పేమీ లేదు. అయినా సరే పెద్దలు అన్న గౌరవంతో చిరంజీవి హుందాగా వ్యవహరించారు.. అది చూసి చాలా మంది చిరంజీవిని ప్రశంసించారు. గరికపాటికి అంత అసహనం ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ఈ విషయంలో నాగబాబు అతి స్పందన సోషల్ మీడియాలో చిరంజీవిని.. ఆయనతో కలిసి నాగబాబును ట్రోల్ చేయడానికి కారణం అయింది. దీన్ని సోషల్ మీడియాలోకి తెచ్చిన నాగబాబు.. ఆయనకు చాలా జెలసీ అని.. చిరంజీవి ఉన్న పలుకుబడి.. క్రేజ్ చూసి ఆయన అసూయ ఫీలయ్యాడని పేరు పెట్టకుండా రాసుకొచ్చారు. ఇది అరోగ్యానికి హానికరమైన సెటైర్ వేశానని అనుకున్నారు.
చిరంజీవి ఇమేజ్ గురించి ఇప్పుడు నాగబాబు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదు. గరికపాటి పెద్దమనిషి. ప్రవచనాలు చెబుతారు. అంతే కానీ ఆయనేమీ సినిమా నటుడు కాదు. మాస్ లీడర్ కాదు.. అసూయ ఫీలవడానికి. ఆయన ఎక్కడికైనా వెళ్తే ఒక్కరు కూడా సెల్పీ దిగరు. అది సహజమే ప్రసంగానికి అడ్డం తగిలేలా చిరంజీవి సెల్ఫీలు దిగుతున్నారు కాబట్టి గరికపాటి వారించారు.దాన్ని స్పోర్టివ్ గా తీసుకోవాల్సిన నాగబాబు సోషల్ మీడియాలో పెట్టి చిరంజీవి ప్రవర్తనను మరింత హైలెట్ చేశారు. ఫలితంగా అది కులాల గొడవలకు కారణం అయింది.