నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రిస్మస్‌కి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారని బయట టాక్. అప్పటికి సినిమా పూర్తయిపోతుంది కూడా. అయితే .. ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అఫీషియల్ అప్ డేట్ నిర్మాతల నుంచి రావడం లేదు. కనీసం టైటిల్ కూడా చెప్పలేదు. ఈ దసరాకి టైటిల్ రివీల్ చేయాలని, ఓ టీజర్ వదలాలని చిత్రబృందం భావించింది. అభిమానులూ అదే ఆశించారు. దసరా వెళ్లిపోయింది. అయినా ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు.
దానికీ ఓ కారణం ఉంది. బాలయ్య `అన్ స్టాపబుల్ 2` ప్రోమోలు ఈ దసరాకి వదిలారు. ఇందుకు సంబంధించి ఓ భారీ ఈవెంట్ కూడా చేశారు. `అన్ స్టాపబుల్`తో పాటుగా బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమాకి సంబంధించిన అప్ డేట్ కూడా ఇస్తే… రెండింటికీ ప్రాధాన్యం తగ్గిపోతుందని భావించారు. అందుకే సినిమా టైటిల్ ప్రకటన హోల్డ్ చేశారు. దీపావళి ఎలాగూ వస్తుంది కదా.. అప్పుడు ఒకేసారి వదలాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి `జై బాలయ్య` టైటిల్ దాదాపుగా ఫిక్సయిపోయినట్టే. బాలయ్య కూడా ఈ టైటిల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది.