మహేష్ బాబు మాతృమూర్తి ఇందిర ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈరోజు 11 రోజుల కార్యక్రమం జరిగింది. ఈనెల 16న కృష్ణ స్వస్థలం బుర్రిపాలెంలో ఓ స్మారక కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి కృష్ణ కుటుంబ సభ్యులంతా వెళ్తున్నారని తెలిసింది. మహేష్, నమ్రతలు కూడా ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల కృష్ఱంరాజు సంస్మరణ సభని.. ఆయన స్వగ్రామం మొగల్తూరులో నిర్వహిస్తే లక్షమంది హాజరయ్యారు. వాళ్లందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ జనం… అక్కడ వడ్డించిన రుచుల గురించి అంతా మాట్లాడుకొన్నారు. ఇప్పుడు బుర్రి పాలెంలోనూ… అలాంటి కార్యక్రమమే నిర్వహించాలని చూస్తున్నారు. మహేష్, కృష్ణ కలిసి వస్తే.. బుర్రిపాలెం ప్రజలకు పండగే. వారిద్దరూ కలిసి స్వగ్రామం వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. కాబట్టి.. 16న అందరి కళ్లూ బుర్రిపాలెం వైపు ఉండొచ్చు.