రెండ్రోజుల క్రితం చిరంజీవి – గరికపాటి ఎపిసోడ్ తో రగిలిన సెగ… ఇంకా పొగలు కక్కుతూనే ఉంది. తాజాగా గాడ్ ఫాదర్ సక్సెస్ మీ ట్లో నూ… ఆ మంట కనిపించింది. ఈ వేదికపై మాట్లాడడానిక వచ్చిన వక్తలు… గరికపాటి ఎపిసోడ్ ని గుర్తు చేశారు. ముందుగా…దర్శకుడు బాబి వంతు. ”చిరంజీవి గారు ఆమద్య నిశ్శబ్ద విస్పోటనం అన్నారు. ఆ మాట విలువ రెండ్రోజుల క్రితమే తెలిసింది. ఎవడు పడితే వాడు.. చిరంజీవిగారికి సరిసాటి రానివాడు కూడా.. తన పని తాను చేసుకొంటూ.. ఆ క్షణం అలా అవుతున్నా.. తన పనికి వెళ్తున్నారు చూశారా.. అదీ చిరంజీవి అంటే..” అంటూ గరికపాటి ఎపిసోడ్‌ని పరోక్షంగా గుర్తుకు తెచ్చారు.
ఇక చిరంజీవికి వీర భక్తుడు ఛోటా కె.నాయుడు అయితే.. కాస్త ఘాటుగానే మండి పడ్డారు. ”దేశంలో ఎంతమంది స్టార్లున్నా.. మెగాస్టార్ ముందు సరిపోరు. ఈమధ్య ఓ బుల్లి ఇన్సిడెంట్ జరిగింది. ఆడెవడో… ఫొటోలు తీసుకొంటామండీ… ఆయనపై అభిమానంతో తీసుకొంటాం.. మాట్లాడేవాడు మహా పండితుడు… ఆయన అలా మాట్లాడొచ్చా అండీ.. అది తప్పు కదా…అలాంటి వాడ్ని కూడా… చిరంజీవి గారు ఇంటికి ఆహ్వానిస్తానంటే.. ఇది కదా సంస్కారం.. ఇది కదా నేర్చుకోవాల్సింది.. అనిపించింది.. ఆయన్నుంచి ఇదే నేర్చుకొంటాం కూడా” అంటూ గరికపాటి – చిరు ఎపిసోడ్ లో చిరువైపు నిలబడి మాట్లాడారు.