నయనతార , విఘ్నేశ్ శివన్ అభిమానులకు స్వీట్ సర్ ప్రైజ్ చెప్పారు. తాము తల్లిదండ్రులైనట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. తమ పిల్లలను ఆశీర్వదించాలని కోరారు. ఈ దంపతులకు ట్విన్ బాయ్స్ జన్మించారు. సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్ పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జూన్ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
ఇంతలోనే నయన్, విఘ్నేశ్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. తమకు ట్విన్స్ పుట్టారంటూ పిల్లల పాదాల ఫొటోలు మాత్రమే పంచుకున్న నయన్ దంపతులు ఇతర ఏ వివరాలనూ చెప్పలేదు. బహుశా ‘సరోగసి’ ద్వారా తల్లిదండ్రులైనట్లు కొన్ని కథనాలు వస్తున్నాయి. ఏదేమైనా.. అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు నయన్, విఘ్నేశ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.