ఫలానా న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ అవుతున్నారంటే… ఆయనంటే తమకు ఇష్టం లేదు కాబట్టి ఏదో ఓ బురద చల్లి ఆయన పదవిని అడ్డుకునే ప్రయత్నం చేయడం.. లేకపోతే ఆయన విశ్వసనీయతను దెబ్బకొట్టడం చేయడం ఇటీవల ప్రారంభమైంది. ఇప్పుడు కొనసాగుతోంది. జస్టిస్ ఎన్వీ రమణ విషయంలో జరిగినట్లుగానే ఇప్పుడు త్వరలో చీఫ్ జస్టిస్ కావాల్సి ఉన్న జస్టిస్ చంద్రచూడ్ సింగ్ విషయంలోనూ జరుగుతోంది. ఆయన దేశ పౌరుడుకాదని.. మరొకటని.. ఆయన పై నిందలేస్తూ.. రాష్ట్రపతికి ఫిర్యాదులు చేసే వాళ్లు ఎక్కువైపోయారు. ఇవన్నీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీనిపై ఢిల్లీ న్యాయవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
ఏ మాత్రం ఆధారాలు లేని ఆరోపణలు… వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టార్గెటెడ్‌గా చేస్తున్న విమర్శలు న్యాయవ్యవస్థకుఇబ్బందికరంగా మారాయని చాలా రోజులుగా అభిప్రాయం వినిపిస్తోంది. సీజేఐగా ఎన్వీరమణపై చేసిన ఆరోపణలు.. కుట్ర పూరితం అని తెలిసిన తర్వాత .. ఆ కుట్ర చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఇలాంటి వారికి ప్రోత్సాహం లభించినట్లయింది. టార్గెట్ చేసుకున్న న్యాయమూర్తులపై విజయవంతంగా నిందలేస్తున్నారు. నమ్మేవాళ్లు నమ్ముతారు.. లేని వాళ్లు లేదన్నట్లుగా ఉంటుంది. అవి తప్పుడు ఆరోపణలు అని తెలిసినా ప్రచారం మాత్రం జరిగిపోతుంది. ఆ ప్రచారం చేసిన వాళ్లకీ ఏమీ కాదు. కానీ న్యాయమూర్తులు మాత్రం మానసికంగా నలిగిపోతున్నారు.
కొన్ని కొన్ని అడ్వాంటేజ్‌లను తీసుకుని తప్పుడు ప్రచారాలు చేసి.. వ్యవస్థపై దాడి చేయడం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. తమపై ఎలాంటి చర్యలు ఉండవని అంచనా వేసుకున్న తర్వాత కొంత మంది రెచ్చిపోతున్నారు. వారి వెనుక ఎదైనా ముఠా ఉందా లేదా అన్నది తేలాల్సి ఉంది. కానీ కానీ ఎన్వీ రమణ సీజేఐగా కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేసిన దగ్గర్నుంచి మాత్రం.. న్యాయవ్యవస్థపై ఓ కుట్ర ప్రకారం దుష్ప్రచారం జరుగుతోంది. దీని వెనుక ఉన్న గూడుపుఠాణి ఏమిటో తేలాల్సి ఉంది.