షాడో.. తెలుగు సాహిత్యంలో మధుబాబు సృష్టించిన అద్భుతమైన పాత్ర. షాడో నవల్స్ అంటే ఒకప్పుడు పిచ్చి. వాటి ఆధారంగా కొన్ని సినిమాలూ వచ్చాయి. అయితే… మధుబాబు `షాడో` రైట్స్ మొత్తాన్ని ఇప్పుడు ఓ దర్శకుడు కొనేశాడు. వాటిని సిరీస్‌లుగా తీయడానికి నిర్ణయించుకొన్నాడు.
`రామారావు ఆన్ డ్యూటీ` ఫేమ్ శరత్ మాండవకు షాడో నవలలంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో వాటిని ఓ సిరీస్ గా తీద్దామనుకొంటున్నాడాయన. ఎట్టకేలకు ఆ రైట్స్ ప్రశాంత్ మాండవ సంపాదించేశాడు. దాదాపు 147 నవల్స్ రాశారు మధుబాబు. వాటి రైట్స్ మొత్తం ఇప్పుడు ప్రశాంత్ దగ్గర ఉన్నట్టే. ఆ 147 నవల్స్ లో కనీసం 20 నవల్స్ అయినా సినిమాలుగా తీయొచ్చు. కనీసం 50 నవల్స్ని వెబ్ సిరీస్‌లుగా తెరకెక్కించొచ్చు. ప్రశాంత్ మాండవ ప్లాన్ అదే. ఒక్కో నవల్ ని ఒక్కో దర్శకుడితో తెరకెక్కించి, ఓ వెబ్ సిరీస్‌లా ప్లాన్ చేద్దామనుకొంటున్నాడు.
ఇది వరకు కూడా షాడో నవల్స్ తీసుకొని, వాటిని వెబ్ సిరీస్‌గా నిర్మించాలని AK ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రయత్నించింది. షాడో పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు బయటకు వచ్చింది. కానీ ఎందుకనో వర్కవుట్ కాలేదు.