నయనతార, విఘ్నేశ్ శివన్ తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. సరోగసి పద్ధతిలోనే ఈ జోడీ తల్లిదండ్రులైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నటి కస్తూరి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘‘ఇండియాలో సరోగసి బ్యాన్. 2022 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. క్లిష్ట పరిస్థితుల్లో తప్ప దీనిని ప్రోత్సహించకూడదు. రానున్న రోజుల్లో దీని గురించి ఎక్కువగా వినబోతున్నాం’’ అంటూ ఆమె ఓ ట్వీట్ చేసింది. కాగా నయనతార అభిమానులు కస్తూరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ‘అర్హత గల న్యాయవాదిగా ఈ చట్టంపై విశ్లేషణ చేసే హక్కు నాకు ఉంది. నేను ఎవర్నీ ఉద్దేశించి ఈ ట్వీట్ పెట్టలేదు’’ అని ఆమె చెప్పుకొచ్చారు.
సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్ పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జూన్ లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇంతలోనే నయన్, విఘ్నేశ్ తల్లితండ్రులయ్యారు. తమకు ట్విన్స్ పుట్టారంటూ పిల్లల పాదాల ఫొటోలు మాత్రమే పంచుకున్న నయన్ దంపతులు ఇతర ఏ వివరాలనూ చెప్పలేదు. దీంతో ‘సరోగసి’ ద్వారా తల్లిదండ్రులైనట్లు కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి