మడమ తిప్పేశారు.. రాజీనామాలెందుకంటున్న గుడివాడ !

వైసీపీ నేతలకు మడమ తిప్పడం అనేది వెన్నతో పెట్టిన విద్యలాగా మారిపోయింది. ఏదైనా అంటే.. వెంటనే కొడాలి నాని డైలాగ్ తరహాలో అమ్మ మొగుడు చెప్పాడా అంటూ ఎదురుదాడికి దిగుతారు. ఇప్పుడు మూాడు రాజధానులకు మద్దతుగా రాజీనామా ల విషయంలోనూ రెండు రోజులకే అదే పద్దతిలో మాట్లాడటం ప్రారంభించారు. తాము ఎందుకు రాజీనామా చేయాలంటూ గుడివాడ అమర్నాథ్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. రాజీనామా చేస్తామని ఎవరూ చెప్పలేదని ఆయనంటున్నారు. మంత్రులు చెప్పిన దానికి కొత్త కొత్త అర్థాలు వివరిస్తున్నారు.

విశాఖ రాజధాని కోసం రాజీనామాలకు సిద్ధమని మంత్రి ధర్మాన ప్రకటించారు. తర్వాతి రోజు అదే ఊపును కంటిన్యూ చేస్తూ.. కరణం ధర్మశ్రీ రాజీనామా చేసేశారు. అది స్పీకర్ ఫార్మాట్‌లో లేకపోయినా స్పీకర్ ఫార్మాట్‌లో ఉందని ప్రచారం చేశారు. సీఎం ఆదేశిస్తే రాజీనామాలు చేస్తామని ఇతర ఎమ్మెల్యేలు ప్రకటించారు. దీంతో అందరూ ఇక రాజీనామాలు చేయడమే తరువాయి అనుకున్నారు. కానీ.. సీన్ మారిపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా మాట మార్చేసారు. రాజీనామాలు చేస్తామని ఎవరు చెప్పారని ప్రశ్నిస్తున్నారు.

అమరావతి మాత్రమే రాజధాని కావాలని తెలుగుదేశం కోరుతోంది. కాబట్టి దాని కోసం వారు రాజీనామా చేయాలి. గతంలో తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌ సభ్యులు రాజీనామా చేశారు. ఇక్కడ మా ఆకాంక్షకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పుడు, మేమెందుకు రాజీనామా చేయాలని ఎదురు వాదిస్తున్నారు. మొత్తంగా రాజీనామాలు చేస్తే.. సర్వం కోల్పోవడం ఖాయమని తెలిసి వచ్చిందేమో కానీ మాట మార్చేశారు. వీరి తీరు చూసి సామాన్య జనం కూడా నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close