బీసీసీఐ చీఫ్‌గా ఉన్న సౌరభ్ గంగూలీని సాగనంపుతున్నారు. ఆయన ఉన్నంత కాలం ప్రతీ నెలా ఆయనపై ఓ పుకారు పుట్టించేవారు. ఆయన రాజీనామా చేశాడని ఓ సారి… ఐసీసీ చీఫ్‌గా వెళ్తారని మరోసారి… రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని మరోసారి పుకారు పుట్టించేవారు దీన్ని చాలా మంది నిజమేనని అనుకునేవారు. చివరికి సౌరభ్ గంగూలీ అలాంటిదేమీలేదని చెప్పుకోవాల్సి వచ్చింది. సొరభ్ పైనే ఇలాంటివి ఎందుకు వస్తాయో క్రికెట్ ఫ్యాన్స్‌కు అర్థమయ్యేది కాదు. చాలా కాలం సస్పెన్స్ తర్వాత ఇప్పుడే అర్థమవుతోంది.
బీసీసీఐ చీఫ్‌గా గంగూలీ పదవి కాలం ముగిసింది. గంగూలీని కొనసాగించడానికి అవకాశం ఉన్నా.. ఆయనను అక్కడ ఉంచడానికి సిద్ధంగా లేరు. రోజర్ బిన్నీని తెరపైకి తెచ్చారు. గంగూలీకి మరో పదవి ఏదో ఆశ చూపుతున్నారు. కానీ గంగూలీ మాత్రం తాను బీసీసీఐ చీఫ్ గా ఉండేందుకే ఆసక్తి చూపతున్నారు. కానీ జే షా మాత్రం అంత ఆసక్తిగా లేరు . రోజర్ బిన్నీనే ఫైనల్ చేసుకుంటున్నారు. అసలు ఈ జే షా ఎవరు.. బీసీసీఐ చీఫ్ కూడా ఆయన చెప్పిన వారే ఎందుకుండాలన్నది పెద్ద చరిత్ర.
గంగూలీని బెంగాల్లో రాజకీయంగా ఉపయోగించుకోడానికి వేసిన ఎత్తులో భాగంగా బీసీసీఐ పదవిని అమిత్ షా అండ్ కో ఆఫర్ చేశారు. ఆయితే వేల కోట్ల లావాదేవీలు నడిచే క్రికెట్ బోర్డులో ఏ మాత్రం క్రికెట్ ఆడిన అనుభవం లేదని జే షా చొరబడ్డారు. ఆయన తండ్రి అండతో తిరుగులేని స్థితికి చేరారు. కానీ గంగూలీ లాంటిక్రికెటర్లు మాత్రం ఆయన దెబ్బకు క్లీన్ బౌల్డ్ అయిపోతున్నారు. ముందు బీసీసీఐలో జేషా ఉంటారు.. గంగూలీ ఉండరు. గంగూలీకి ఏదైనా పదవి వస్తుందా అన్నది కూడా ఇప్పుడే చెప్పలేము.