రెండు అంటే రెండు నిమిషాల ప్రోమోపై వైసీపీ నేతలు వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వాళ్ల ఫ్రస్ట్రేషన్‌తో ఆ షోపై ఆసక్తిని పెంచేస్తున్నారు. మరో రోజులో అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఓటీటీలో అప్ లోడ్ కానుంది. ఈలోపే వైసీపీ నేతలు కూడా కావాల్సినంత పబ్లిసిటీ ఇచ్చేస్తున్నారు. ఎన్టీఆర్ ను దింపేయడం.. లోకేష్ స్విమ్మింగ్ ఫూల్ ఫోటోల వంటివి ఈ ప్రోమోలో చర్చకు రావడమే కారణం.
ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయి 27 ఏళ్లు అయింది. అప్పటి ఘటనలపై చంద్రబాబు నిందలు మోస్తూనే ఉన్నారు. నిజానికి అది చంద్రబాబు ఒక్కరు చేసింది కాదు. ఎన్టీఆర్, లక్ష్మిపార్వతి మాత్రమే ఓ వైపు ఉన్నారు. మిగతా వారంతా టీడీపీ వైపు ఉన్నారు. ఆ ఎపిసోడ్‌పై ఎంత జరిగినా ప్రజలు చంద్రబాబును ఆదరించారు. స్వయంగా ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లారు. కానీ ప్రజలు పట్టించుకోలేదు. ఎన్టీఆర్ మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో నందమూరి హరికృష్ణతో పాటు లక్ష్మి పార్వతి కూడా ప్రత్యేక పార్టీలతో రంగంలో ఉన్నారు. అయినా ప్రజలు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీనే ఆదరించారు. అయితే ఇప్పటికీ విపక్షాలు … నచ్చని వాళ్లు చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు.
ప్రోమో విపరీతంగా ఆకట్టుకోవడంతో పధ్నాలుగో తేదీన ఓటీటీలో ప్రసారం కానున్న మొదటి ఎపిసోడ్‌పై అందరి దృష్టి పడింది. సామాన్యుల్లో కూడా ఈ ఎపిసోడ్‌పై చర్చ జరుగుతోంది. . అందుకే ప్రోమో కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఇదేదో తేడాగా ఉందనుకున్నారేమో కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా విమర్శలు ప్రారంభించారు. ఆ షోను తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. విమర్శలు చేస్తున్నారు. కానీ దాని వల్ల ఈ అంశంపై ఎక్కువ చర్చ జరగాలని టీడీపీ కోరుకుంటోంది. వైసీపీ నేతల స్పందన కూడా అలాగే ఉంది.