వైసీపీకి వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుందనుకుంటే వెంటనే సీఐడీ అధికారులు వేళాపాళా లేకుండా రంగంలోకి దిగి ఓ టీడీపీ నేతను అరెస్ట్ చేస్తారు. ప్రైవేటు సైన్యాలు ఎలా ఎగబడతాయో అలా వచ్చేస్తారు. చట్టం.. న్యాయం ఏమీ ఉండవు. పట్టుకెళ్లిపోవడమే. అలా చేస్తేనే సంచలనం అవుతుంది. కాస్త మీడియాలో హైలెట్ అవుతుంది. తర్వాత పరిణామాలు ఎవరు ఎదుర్కొంటారు అన్న సంగతి పక్కన పెడితే.. ఇలా జరిగినప్పుడల్లా హైలెట్ కావడం.. కొన్ని కీలక అంశాలు చర్చకు రాకుండా పక్కకుపోవడం కామన్ అయిపోయింది.
తాజాగా టీడీపీ ఆఫీసులో మీడియా వ్యవహారాలను సమన్వయం చేసే దారపనేని నరేంద్రను అరెస్ట్ చేశారు. ఆయన చేసిన తప్పేమిటంటే వాట్సాప్ పోస్టును ఫార్వార్డ్ చేయడం. ఇలాంటి కేసుల్లో అర్థరాత్రిళ్లు అరెస్ట్ చేస్తారా అని కోర్టులు ఇప్పటికే షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చాయి. కానీ సీఐడీ అధికారుల తీరు మారలేదు. వారు ప్రైవేటు సైన్యంగా అరాచకాలకు పాల్పడటానికే ఫిక్సయ్యారు. రేపు కోర్టులో ఏం జరుగుతుందో కోనీ… ఇది ఖచ్చితంగా డైవర్షన్ అరెస్టేనని.. తమకు వ్యతిరేకంగా జరిగిన.. జరగోబోయే అంశాన్ని హైలెట్ కాకుండా చేయడమేనన్న వాదన మాత్రం బలంగా వినిపిస్తోంది.
వైఎస్ వివేకా కేసులో షర్మిల వాంగ్మూలం ఇచ్చిందన్న ప్రచారం.. వైఎస్ అవినాష్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారన్న పుకార్లు ఈ అరెస్టుకు కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో వైజాగ్లో ల్యాండ్ సెంటిల్మెంట్లు.. విజయసాయిరెడ్డి భూదందాలపై విపరీతమైన చర్చ జరుగుతోంది. వీటన్నింటికీ .. ఓ అక్రమ అరెస్టుతో చెక్ పెట్టాలని అనుకుంటున్నట్లుగా టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. కారణం ఏదైనా ఈ అరెస్టులు మాత్రం సీఐడీ వ్యవహారంపై ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.