”దర్శకులు సెట్స్ లో డైలాగులు రాస్తున్నారు” ఈ మధ్య చిరంజీవి చేసిన ఈ కామెంట్ వైరల్ అయ్యింది. చాలా మంది కొరటాల శివని ఉద్దేశించి ఈ కామెంట్ చేశారని వార్తలు రాశారు. అయితే దీనికి తాజాగా చిరంజీవి వివరణ ఇచ్చారు. ఇది జనరల్ గా చెప్పాని వివరించారు.
”నేను జనరల్ గా ఆ మాట అన్నాను. కానీ దానిని వేరేలా ఆపాదించుకున్నారు. నేను ఏ సినిమాని ఉద్దేశించి ఆ మాట చెప్పలేదు. జనరల్ గా ఇలాంటి పరిస్థితి వుందని చెప్పడమే నా ఉద్దేశం. గాడ్ ఫాదర్ విషయానికి వస్తే మోహన్ రాజా అద్భుతమైన ప్రీప్రొడక్షన్ వర్క్ చేశారు. దిని వలన సమయం, డబ్బు రెండూ కలిసొస్తాయి. అయితే సెట్స్ లో డైలాగులు రాసే ట్రెండ్ వుంది. దిని వలన నిర్మాతలతో పటు నటీనటులుకు కూడా ఇబ్బందే. మొదటే డైలాగ్ చేతిలో వుంటే నటుడికి నేర్చుకోవడానికి కొంత సమయం దొరుకుతుంది. నిర్మాత సమయం కలిసొస్తుంది” అని చెప్పుకొచ్చారు చిరు.