అబ్బే తాము అరెస్టులు చేస్తున్నాం కానీ కొట్టడానికి కాదు.. అంతా ఆరోపణలే అని సీఐడీ … అంటోంది. మరి కోర్టుల్లో నిలబడదని తెలిసి కూడా .. అర్థరాత్రుళ్లు అరెస్టు చేయడం… తర్వాతి రోజు తెల్లవారుజామున కోర్టులో ప్రవేశ పెట్టడం ఎందుకు ? ఈ మధ్యలో ఏం చేస్తున్నారు ?. సోషల్ మీడియాలో పోస్టుల సంగతి తర్వాత ఇప్పుడువాట్సాప్లో ఫార్వార్డ్ చేసిన దానికీ అర్థరాత్రుళ్లు అరెస్టులు చేస్తున్నారు. హింసిస్తున్నా రు. తర్వాతకోర్టులో ప్రవేశ పెడుతున్నారు. కోర్టు రిమాండ్ తిరస్కరిస్తోంది.
సీఐడీ పోలీసులు కొట్టడానికే ఇలా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఎవరికైనా తెలుస్తుంది. పోలీసులు కొట్టరు అంటే నమ్మేవాళ్లు ఎవరూ ఉండరు. అయితే కొట్టజానికే అక్రమ అరెస్టులు చేయడం మాత్రం చిన్న విషయం కాదు. ఇది ప్రైవేటు ముఠాలు చేసే పని. అంత కంటే దారుణంగా సీఐడీ తయారయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం.. వాట్సాప్ పోస్టులు షేర్ చేయడం… తప్పెలా అవుతుందో సీఐడీపోలీసులు కనీసం చెప్పలేరు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలిస్తే వారీమాట అనరు.
రాష్ట్రంలో హత్యలు చేసిన వాళ్లు.. దోపిడీలు చేసిన వారు నిర్భయంగా తిరుగుతున్నారు. పట్టపగలు ఇద్దరు ప్రముఖులపై హత్యాయత్నం చేస్తే స్టేషన్ బెయిల్ ఇస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై పోరాడుతున్న విపక్ష నేతల్ని మాత్రం సోషల్ మీడియా పోస్టింగ్‌ల పేరుతో అర్థరాత్రుళ్లు అరెస్టులు చేసికొడుతున్నారు. ఇలాంటి మానవహక్కుల ఉల్లంఘన నియంతలు పాలిస్తున్న దేశాల్లోనూ ఉండదు. ఇప్పుడు ఇలా చేశారు.. రేపు అధికారంలోకి వచ్చేవారు అంతకు మించి అన్నట్లుగా చేస్తారు. అందలో సందేహం లేదు. ఈ పరిస్థితి ఇలా దిగజారిపోతుంది. దాని వల్ల అంతిమంగా నష్టపోయేది వ్యవస్థే.