సీఎం జగన్ జిల్లాల పర్యటనలకు పరదాలు కడుతున్న వారు బిల్లులివ్వడం లేదు మహా ప్రభో అని గగ్గోలు పెడుతున్నారు. హైకోర్టులో ప్రభుత్వం నుంచి చేసిన పనులకు బిల్లులు రావడం లేదని.. రోజుకు ఆరేడు వందల పిటిషన్లు పడుతున్నాయి. అవన్నీ పక్కన పెట్టి.. ఒక్కొక్కరికి రూ. పది లక్షలు ఇస్తామంటూ వైఎస్ఆర్ అవార్డుల్ని ప్రకటించారు. మిగిలిన వాళ్లను పక్కన పెడితే..నలుగురు జర్నలిస్టుల పేర్లు మాత్రం అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆ నలుగురు ఎవరంటే బండారు శ్రీనివాసరావు, సతీష్ చందర్, మంగు రాజగోపాల్, ఎంఈవీ ప్రసాదరెడ్డి.
వీరి గురించి జర్నలిజం సర్కిళ్లలో అందరికీ తెలుసు. ప్రభుత్వానికి బాకా ఊదడానికి ఏ మాత్రం సిగ్గుపడకుండా.. అడ్డగోలుగా సమర్థిస్తూ మాట్లాడటంలో రాటుదేలిపోయారు. బండారు శ్రీనివాసరావు అనే జర్నలిస్టు రిటైరైన తర్వాత ఎర్నలిస్టుగా మారారు. అడ్డగోలుగా వాదిస్తూ టీవీ చానళ్లలో చర్చల్లో పాల్గొంటున్నారు. ఆయనకు ఎంతో కొంత ముట్టచెప్పాలనుకున్నారు కాబట్టి వైఎస్ఆర్ అవార్డు కింద నగదు ప్రకటించినట్లుగా ఉంది. మిగిలిన వారూ అంతే. ఇక ఎంఈవీ ప్రసాదరెడ్డి అనే జర్నలిస్టు గురించి .. పెద్దగా ఎవరికీ తెలియదు. కళ్లను నమ్ము కమ్మని నమ్మవద్దంటూ.. ఇటీవస ఈ రెడ్డిగారు ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్యూ ఇచ్చారు.
ఇది బాగా నచ్చిందేమో కానీ ఓ రూ. పది లక్షల అవార్డు ఇచ్చేశారు. వీరి ఎంపిక ఇతర సీనియర్ జర్నలిస్టులకుపోటీ పెట్టినట్లయింది. ఎవరు గొప్పగా పొగుడుతారో.. వాళ్లకి వచ్చే సారి అవార్డిస్తారు. రూ. పది లక్షలు గెల్చుకోవచ్చు. అయితే ఈ అవార్డులు ఎప్పుడిస్తారు.. జయంతి.. వర్థంతులు.. సెప్టెంబర్‌తోనే అయిపోయాయి. మళ్లీ వచ్చే ఏడాది వరకూ ఆగాలా.. మరో కార్యక్రమం పెట్టి ఇస్తారా అన్నది వేచి చూడాలి.