కీర్తి సురేష్ ఇప్పటి వరకూ పద్ధతైన పాత్రలే వేసింది. డీసెంట్ గా కనిపించింది. వెండి తెరపై మరీ గ్లామర్ ఒలకబోయకపోయినా… అందంగా కనిపించే పాత్రలే సెలెక్ట్ చేసుకొంది. తన కెరీర్లో తొలిసారి ఓ డీ గ్లామర్ పాత్ర ఎంచుకొంది. అదే `దసరా`. ఈ సినిమాలో వెన్నెలగా కనిపించబోతోంది కీర్తి. ఈ రోజు కీర్తి సురేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి కీర్తి ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. అలవాటైన పాత్రలకు చెక్ పెడుతూ… కొత్తగా కనిపించింది కీర్తి. పెళ్లి బట్టల్లో.. మెరిసిపోతూ, మాస్ స్టెప్పులేస్తూ ఫోజు ఇచ్చింది. ఈ సినిమాలో నాని లుక్ కూడా చాలా `రా`గా ఉన్న సంగతి తెలిసిందే. తన కెరీర్లో నాని కూడా ఈ తరహా గెటప్పులో ఎప్పుడూ కనిపించలేదు. కీర్తిని చూస్తుంటే.. `రంగస్థలం`లో సమంత చేసిన పాత్ర గుర్తుకొస్తుంది. అది కూడా డీ గ్లామరే. కథలో భాగమైన ఆ పాత్ర `రంగస్థలం`కి వన్నె తెచ్చింది. `దసరా`లో కీర్తి కీ ఆ ఛాన్స్ వచ్చినట్టు కనిపిస్తోంది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది.
Introducing @KeerthyOfficial as 'Vennala' from #Dasara ❤️?
Wishing the super talented and National Award winning actress a very Happy Birthday ❤️
Natural Star @NameisNani @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/RyNCbXioXl
— SLV Cinemas (@SLVCinemasOffl) October 17, 2022