అభిమన్యుడు చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు పిఎస్ మిత్రన్. ఇప్పుడు కార్తి హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’ చేశారు. రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న వస్తోంది. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తోంది. కాగ గతంలో అఖిల్ హీరోగా మిత్రన్ ఒక సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపించాయి. దీనిపై మిత్రన్ స్పందించారు.
”అన్నపూర్ణ స్టూడియోస్ నా ఫేవరేట్ ప్రొడక్షన్ హౌస్. నాగార్జున గారి ఆతిధ్యం అద్భుతంగా వుంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సర్దార్ ని తెలుగు విడుదల చేయడం అనందంగా వుంది. అఖిల్ తో ఒక సినిమా చేసే ఆలోచన ఎప్పటి నుండో వుంది. చాలా సార్లు కథా చర్చలు జరిపాం. అఖిల్ కోసం కథ రాస్తున్నా. అఖిల్ ఏజెంట్ తో బిజీగా వున్నారు. దిని తర్వాత అఖిల్ కి కథ వినిపిస్తా” అని చెప్పుకొచ్చారు మిత్రన్.