తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వారం రోజులు అయింది. రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారేమో స్పష్టత లేదు కానీ.. బహిరంగంగా మాత్రం ఎవరితోనూ చర్చలు జరపడం లేదు. అయితే హఠాత్తుగా ఆయన సీఎస్‌ను ఢిల్లీ పిలిపించుకున్నారు. ఓ వైపు మునుగోడు ఎన్నికలు జరుగుతూండటం..మరో వైపు పాలనను పట్టించుకునేవారు లేకపోయినా సరే కేసీఆర్ ఢిల్లీలో మకాం వేయడంతో రాజకీయ పరమైన విమర్శలకు కారణం అవుతోంది.
అయితే ఇప్పటి వరకూ ఏమీ చెప్పని టీఆర్ఎస్ వర్గాలు ఇప్పుడు కేసీఆర్‌కు స్వల్ప అనారోగ్యం కలిగిందని.. ఆయన జ్వరంతో బాధపడుతున్నారని అందుకే విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఎలాంటి సమావేశాలు మూడు రోజులు నిర్వహించలేదని అంటున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితుల కారణంగానే విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతున్నారు. కేసీఆర్ హైదరాబాద్ రాలేకపోతున్నందన… సీఎస్ తో పాటు కొంత మంది ఉన్నతాధికారులను ఢిల్లీకి పిలిపించుకున్నారు.
ఎవరైనా పార్టీ ప్రకటించిన తర్వాత ఎలాంటి గ్యాప్ రాకుండా .. పార్టీని ప్రజల్లో నానే చేయాలని అనుకుంటారు. అలా చేస్తేనే ఫ్యూచర్ ఉంటుంది. ఆ విషయం కేసీఆర్‌కు తెలియనిదేం కాదు. కానీ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చాలని తీర్మానం చేసిన తర్వాత ఆయన సెలెంట్ అయిపోయారు. కనీసం జాతీయ మీడియాకు కూడా ఇంటర్యూలు ఇవ్వలేదు. తన పార్టీ విధివిధానాలను కూడా సవయంగా ప్రకటించలేదు. అదే సమయంలో సెమీ ఫైనల్ లాంటి మునుగోడు ఉపఎన్నిక జరుగుతున్న సమయంలో ఆయన ఢిల్లీలో మకాం వేయడం.. అక్కడికే ఉన్నతాధికారుల్ని పిలిపించుకోవడం వెనుక మతలబు ఉందని నమ్మకానికి వస్తున్నారు. అదేమిటన్నది టీఆర్ఎస్ నేతలకు స్పష్టత లేదు.