పవన్‌కు దమ్ము లేదు..అందుకే పొత్తులు పెట్టుకున్నారని ఒకరంటారు.. ఒక్క జగన్‌పై అందరూ కలిసి వస్తున్నారని మరొకరు అంటారు.. 175 స్థానాల్లో పోటీ చేస్తే ప్యాకేజీ స్టార్ అనం అని ఒకరు ఆఫర్ ఇస్తారు. ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటే ఓకే కానీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం మాత్రం తప్పేనని వైఎస్ఆర్సీపీ నేతలు వాదించడం ప్రారంభించారు.వైసీపీ నేతల ఈ కంగారు ప్రకటనలు చూసి.. వైసీపీ క్యాడర్ కూడా ఏం జరుగుతోందని విశ్లేషించుకునే పరిస్థితి వచ్చింది. జనసేన పార్టీ ఎలా పోతే మనకెందుకు.. ఎందుకంత కంగారుపడుతున్నామనేది ఎక్కువ మంది భావన. ఆ కంగారేంటో.. .మాట్లాడుతున్న వారికి తెలుసు.. కింది స్థాయి వారికి తెలియకపోవచ్చు.
వైసీపీ గెలుపు.. ఓటమికి తేడా జనసేన పార్టీనే. జనసేన మద్దతుతో టీడీపీ 2014లో పోటీ చేసినప్పుడు టీడీపీ విజయం సాధించింది. 2019లో జనసేన విడిగా పోటీ చేసింది. వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇప్పుడు మళ్లీ టీడీపీకి దగ్గరవుతోంది. రెండు పార్టీలు కలిస్తే విజయం ఏకపక్షమన్న విశ్లేషణలు కొన్ని వర్గాల నుంచి వచ్చాయి. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలో ఫలితాలు జనసేన చీల్చిన ఓట్లతో మారిపోయాయి. అదే సమయలో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఆ పార్టీ ఎలాగూ గెలవదన్న కారణంగా ప్రత్యామ్నాయంగా ఓట్లు వేసిన ఓటర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇది రివర్స్ అవుతుంది.
అధికారంలో ఉన్న పార్టీకి.. తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలిపోతే లాభం. ఈ రాజకీయం వైసీపీకి తెలుసు కాబట్టి.. విపక్షాల్ని ఏకం కానీయకుండా చూసుకుంటాయి అధికార పార్టీలు. కానీ ఏపీలో ఆ వ్యూహం ఫలించడం లేదు. జనసేన అధనేత తమ బలాన్ని..బలగాన్ని అంచనా వేసుకుని ఒంటరిగా పోటీ చేయాలా.. పొత్తులు పెట్టుకోవాలో డిసైడ్ చేసుకుంటారు. అది ఆయన ఇష్టం. వైఎస్ఆర్సీపికి సంబంధం లేదు. ఆ పార్టీకి మేలు చేసేలా పవన్ నిర్ణయాలు తీసుకోరు. జనసేనకు .. రాష్ట్రానికి ఏది మంచిదైతే ఆ నిర్ణయం తీసుకుంటారు !