నందమూరి బాలకృష్ణ, గోపి చంద్ మలినేని సినిమాకి ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్ పెట్టారు. గాడ్ అఫ్ మాసెస్ అనే క్యాప్షన్ కూడా వుంది. నిజానికి ఈ సినిమా కోసం మూడు టైటిళ్ళు పోటిపడ్డాయి. అన్నగారు, పెద్దాయన, వీరసింహారెడ్డి. చివరికి వీరసింహారెడ్డికే బాలయ్య ఓటు పడింది. వీరసింహారెడ్డి టైటిల్ అంత కొత్తదనం లేదు. ‘రెడ్డి’ ట్యాగ్ తో చాలా సినిమాలు చేశారు బాలయ్య. దీంతో ఇది కొంచెం పాతవాసనే కొడుతుందని ఫ్యాన్స్ ఫీలౌతున్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితిలో ‘రెడ్డి’ టైటిల్ తో సినిమా చేయడం ఎందుకని బాలయ్య పొలిటికల్ అనుచరుల ఫీలింగ్. కానీ ‘వీరసింహారెడ్డి’ టైటిల్ కే ఒటేశారు బాలయ్య.
నిజానికి టైటిల్స్ విషయంలో చాలా చర్చ జరిగింది. అన్నగారు టైటిల్ అయితే బావుటుందని నిర్మాతలు భావించారు. ”అన్నగారు అంటే నాన్నాగారే గుర్తుకు వస్తారు. తెలుగు సీమలో అన్నగారనే మాట నాన్నగారికే సొంతం. మన సినిమాకి ఆ టైటిల్ వద్దు”అని ఖరాకండీగా చెప్పారట బాలయ్య. ఇక ‘పెద్దాయన’ పేరు వినగానే వైయస్సార్ గుర్తుకు వస్తారు. అదీ వద్దు. సినిమాలో నా పాత్ర పేరే టైటిల్ గా పెట్టండి. ‘సింహం’ మనకి కలిసొస్తుందని” చెప్పారట బాలయ్య. దీంతో వీరసింహారెడ్డి పేరు ఫైనల్ అయ్యింది. సినిమాని సంక్రాంతి కానుగా సినిమాని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.