దీపావళికి నాలుగు సినిమాలు వచ్చాయి. బాక్సాఫీసు పోటి ఎక్కువ ఉంటుందని భావించారు. అయితే ‘సర్దార్’ఒక్కటే పై చేయి సాధించింది. సర్దార్ కి చాలా మంచి రివ్యూలు వచ్చాయి. అలాగే కలెక్షన్స్ కూడా డీసెంట్ గా వున్నాయి. రెండో రోజు పెరిగాయి. ‘ఓరి దేవుడా’ సినిమాకి కూడా మంచి టాక్ వచ్చింది. మౌత్ టాక్ తో కలెక్షన్స్ పెరుగుతాయనే నిర్మాతలు అంచానా వేస్తున్నారు. యూత్ టార్గెట్ గా తీసిన సినిమా అది. అయితే రివ్యూలు క్లీన్ ఫ్యామీలీ ఎంటర్ టైనర్ అని వచ్చాయి. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కి రిచ్ అయ్యేలా ప్లాన్ చేయాలని యూనిట్ భావిస్తుంది.
‘ప్రిన్స్’ కి తమిళ సినిమా అనే ముద్రపడిపోయింది. అనుదీప్ కామెడీ ఉన్నప్పటికీ జాతిరత్నాలనే గుర్తు చేయడం ఒక మైనస్. తమిళ్ వెర్షన్ తెలుగు కంటే వీక్ గా వుందని టాక్. మంచు విష్ణు ‘జిన్నా’ పై రొటీన్ ముద్ర పడింది. రొటీన్ మసాలా సినిమాకి హారర్ ఎలిమెంట్ యాడ్ చేశారు తప్పితే కొత్తదనం లేదనే టాక్ వచ్చింది. ట్రెండ్ చూస్తుంటే ఈ నాలుగు సినిమాల్లో సర్దార్ పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. అన్నట్టు.. నాలుగు సినిమాలు రావడంతో ‘కాంతార’ని చాలా చోట్ల తీసేశారు. అయితే కాంతార ఆడుతున్న థియేటర్లని వెదికిమరీ వెళ్తున్నారని పబ్లిక్ టాక్.