ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై భారత్ సూపర్ విజయం సాధించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (82) నాట్ అవుట్ గా నిలిచి టీమ్ఇండియాను గెలిపించాడు. టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. చేజింగ్ కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 31 పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమ్ఇండియాను విరాట్ కోహ్లీ-హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. వందపరుగుల భాగస్వామ్యం సాధించారు.
నరాలు తెగే ఉత్కంఠ:
ఆఖరి ఓవర్ హైడ్రామా నడిచింది. ఆరు బంతులకు 16 పరుగులు కావల్సివుండగా మొదటి బంతికి హార్దిక్ అవుట్ అయ్యాడు. దినేష్ కార్తిక్ వచ్చి సింగల్ తీశాడు. తర్వాత విరాట్ సిక్స్ బాదాడు. ఐతే ఇదే బంతికి నో బాల్ వచ్చింది. నొ బాల్ కి మూడు పరుగులు వచ్చాయి. బ్యాటింగ్ కి వెళ్ళిన దినేష్ అవుట్ అయ్యాడు. దీంతో మళ్ళీ ఉత్కంఠ నెలకొంది. అశ్విన్ బ్యాటింగ్ కి వచ్చాడు. వైడ్ పడింది. స్కోర్స్ లెవల్ అయ్యాయి. చివరి బంతికి ఒక పరుగు కావాలనగా అశ్విన్ పరుగు సాధించాడు. నరాలు తెగే ఉత్కంఠ తెరపడింది. ఇండియా అద్భుతమైన విజయం అందుకుంది.