ప్రభుత్వ పాలన ఎలా ఉండంకూడదో వైసీపీ ప్రభుత్వం గురించి పుస్తకాలకు పుస్తకాలే రాసుకోవచ్చు. టోటల్‌గా చెప్పాలంటే… అసలు ఇది రాజ్యాంగ పాలనే కాదని ప్రతీ విషయంలోనూ వాదించవచ్చు… అంత స్టఫ్ ఇస్తుంది వైసీపీ ప్రభుత్వం. దానికి తాజా సాక్ష్యం.. జీవోలను సీక్రెట్‌గా ఉంచుతూ.. ఇంటలిజెన్స్ రిపోర్టుల్ని లీక్ చేయడం. జనసేన కార్యకర్తలు 13మంది మంత్రులపై దాడి చేసే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందట. అది మీడియా, సోషల్ మీడియాకు లీక్ అయింది. దాంతో పోలీసులు భద్రత పెంచారు.
ఇంటలిజెన్స్ రిపోర్టులు లీక్ కావడం అంటే చిన్న విషయం కాదు. అసలు ఇంటలిజెన్స్ అంటేనే సీక్రెట్. అలాంటి ఆ సంస్థ .. ఇచ్చిన రిపోర్టు మీడియాకు వచ్చిందంటే ప్రభుత్వం అసలు రహస్యాలు కాపాడటంలో పూర్తిగా విఫలమైనట్లే. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఇదేదో ప్రభుత్వమే తమ అనుకూల మీడియాకు కావాలని లీక్ చేసినట్లుగా … సైలెంట్ గా ఉన్నారు. ఆ రిపోర్టును చూపించి చాలా మంది వైసీపీ సానుభూతిపరులు జనసేనపై విమర్శలు చేస్తున్నారు. జనసేన పార్టీ ఇదే విషయాన్ని ప్రశ్నిస్తోంది. రాజకీయ కుట్రల కోసం ఇంటలిజెన్స్ రిపోర్టును లీక్ చేసి మరీ డ్రామా ఆడుతున్నారా అని ప్రశ్నిస్తోంది. రాష్ట్ర భద్రతను పణంగా పెట్టారా అని ప్రశ్నిస్తోంది.
ఏపీలో ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నట్లుగా మారింది. రాజ్యంగం పట్టదు.. పోలీసులు తమ విధులు కేవలం వైసీపీ కోసమే అన్నట్లుగా నిర్వహిస్తూ ఉంటారు. రాష్ట్రంలో ప్రతీ చోటా ఉన్మాదులు చెలరేగిపోతున్నారు. శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి అయినా పోలీసులు ఎక్కడా కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. కానీ రాజకీయంగా మాత్రం వారు యాక్టివ్‌గా ఉంటారు. దీని వల్లే రాష్ట్రంలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని ఇతర పార్టీలు చేసే ఆందోళనలో నిజం ఉంటుంది.