గీతా ఆర్ట్స్ తెలివే తెలివి. `కాంతార` విజయాన్ని ముందే పసిగట్టిన అల్లు అరవింద్.. ఆ సినిమా తెలుగు రైట్స్ ని చాలా తక్కువ మొత్తానికి కొనేశారు. ఇప్పుడు `కాంతార` గీతా ఆర్ట్స్‌కి గణణీయమైన లాభాల్ని తెచ్చి పెట్టింది. దాంతో ఆగలేదు. రిషబ్ శెట్టితో ఓ సినిమా చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు గీతా ఆర్ట్స్ తో ఓ ఒప్పందం కూడా జరిగింది. ఇప్పుడు రిషబ్ శెట్టి పాత సినిమాలన్నీ తెలుగులో డబ్ చేయించి, ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ డీల్ కూడా ఓకే అయిపోయింది. కన్నడలో రిషబ్ నటించిన బెల్ బోటెమ్ సినిమాని ఆహా ఇది వరకే డబ్ చేసి, విడుదల చేసింది. ఆ సినిమాకీ మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడు తెలుగులో రిషబ్ శెట్టికి పాపులారిటీ పెరిగింది కాబట్టి.. రిషబ్ పాత సినిమాల హక్కుల్నికొనుగోలు చేసి, తెలుగు ప్రేక్షకులకు అందించాలన్న నిర్ణయానికి వచ్చింది.
మరోవైపు… రిషబ్ తో ఓ స్ట్రయిట్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తోంది. రిషబ్ దర్శకుడు అనగానే చాలామంది తెలుగు హీరోలు ముందుకొస్తారు. కాకపోతే.. రిషబ్ శెట్టినే దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తే బాగుంటుందన్నది అల్లు ఆలోచన.