రాజమౌళి టీమ్‌లో కీలక పాత్రధారి విజయేంద్ర ప్రసాద్. ఆయన కథా చక్రవర్తి. ఓ కథలో ఎన్నిరకాలైన ఎమోషన్లు ఉండాలో ఆయనకు పర్ఫెక్ట్ గా తెలుసు. ఆ ఎమోషన్లని ఎలా పండించాలో రాజమౌళికి తెలుసు. కాబట్టి.. ఈ కాంబో దిగ్విజయంగా సాగిపోయింది. విజయేంద్రప్రసాద్ కథ లేకుండా రాజమౌళి సినిమా చేయలేదు గానీ, తన కథల్ని మాత్రం బయట హిట్లు చేసుకొన్నారు… విజయేంద్ర ప్రసాద్. `భజరంగీ భాయ్ జాన్` అందుకు ఓ మేలిమి ఉదాహరణ. అయితే.. విజయేంద్రప్రసాద్ దగ్గర ప్రస్తుతం దాదాపు పది కథలు సిద్ధంగా ఉన్నాయని టాక్. అవన్నీ.. రాజమౌళి చేయలేడు.కాబట్టి.. బయట దర్శకులకు, నిర్మాణసంస్థలకూ ఇచ్చేయాలని భావిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసిన వాటిలో `విక్రమార్కుడు 2` కూడా ఉంది. బాహుబలిలోని కొన్నిప్రధానమైన పాత్రల్ని మెయిన్ లీడ్ గా తీసుకొని కొన్ని కథలు రెడీ చేశార్ట. ఇవన్నీ కమర్షియల్ గా వర్కవుట్ అయ్యే ప్రాజెక్టులే. అయితే ఈ కథల్ని డీల్ చేసే దర్శకులే కావాలి. అలాంటి వాళ్లు దొరికితే.. విజయేంద్ర ప్రసాద్ కథలన్నీ తెరపైకి వచ్చేసినట్టే. `విక్రమార్కుడు 2` సబ్జెక్ట్ ఎప్పుడో రెడీ అయిపోయింది. కానీ.. హీరో, దర్శకుడు కావాలి. రవితేజ సిద్ధంగానే ఉన్నా, ఈ సబ్జెక్ట్ ని కమర్షియల్ గా, అన్ని హంగులతో పట్టాలెక్కించే డైరెక్టర్ మాత్రం దొరకాలి.