తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం.. జీడిపాకంగా సాగుతోంది. చట్ట పరంగా కేసు నిలువదని తేలిపోయిందేమో కానీ కోర్టుకు ఇవ్వకుండా ప్రజల్లోకి ఆడియోలు రిలీజ్ చేస్తున్నారు. వరుసగా రెండు ఆడియోలను టీఆర్ఎస్ లీక్ చేసింది. అందులో మొదటి దాంట్లో రామచంద్ర భారతి, రోహిత్ రెడ్డి, నందకుమార్ మధ్య పార్టీ మార్పుపై చర్చలు జరిగాయి. రెండో టేపులో డబ్బుల ప్రస్తావన ఉంది. రోహిత్ వంద అడిగారని నందకుమార్ చెప్పుకొచ్చారు. అసలు వీరు బీజేపీ కోసం ఎవరితో డీల్ చేశారన్నది్ మాత్రం స్పష్టత లేదు. బీజేపీలోని టాప్ టు వ్యక్తులతో మాట్లాడిస్తామని మాత్రం చెప్పారు. రెండు ఆడియో టేపులను రిలీజ్ చేశారు. అయితే వీటిని కోర్టులో ప్రవేశ పెట్టలేదు.
ఇంత మొత్తంలో డబ్బులు దొరికాయని పోలీసులు కూడా ప్రకటించలేదు. దీంతో కేసు తేలిపోయింది. ఆడియో టేపుల్లో భారతీ శిక్షాస్మృతి ప్రకారం శిక్షించేంత నేరం ఏమీ లేదని.. రెండు వర్గాల మధ్య మాటలు మాత్రమే ఉన్నాయని న్యయవర్గాలు చెబుతున్నాయి. అందుకే టీఆర్ఎస్ కూడా ఈ అంశంలో ఎలా ముందుకెళ్లాలో తర్జన భర్జన పడుతోందని చెబుతోందన్నారు. మరో వైపు రోహిత్ రెడ్డి సహా ఈ డీల్లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు ఇంకా ప్రగతి భవన్లోనే ఉన్నారు. ఫామ్ హౌస్లో కేసు బయటపడిన రోజున వారు ప్రగతి భవన్కు వెళ్లారు అక్కడే ఉండిపోయారు. వారి ఫోన్లు కూడా స్విచ్చాగిపోయాయి. అయితే రేగ కాంతారావు పేరుతో ఫేస్ బుక్లో పోస్టులు వస్తున్నాయి.
ఇవాళ కేసీఆర్ ప్రెస్మీట్ పెడతారని ఆయన చెప్పారు. ాకనీ కేసీఆర్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆ రోజునే ఎమ్మెల్యేలతో కలిసి మీడియా ముందుకు వస్తారన్నారు. రాలేదు. గురువారం వస్తారన్నారు. శుక్రవారం ఢిల్లీకి వెళ్లి .. ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెడతారన్నారు. కానీ ఆయన మాత్రం ప్రగతి భవన్ నుంచి కదల్లేదు. ఈ మొత్తం వ్యవహారంలో టీఆర్ఎస్ ఏమీ చేయలేకపోంది. వీలైనంత వరకూ ప్రజల్లో ఈ ఆడియో టేపులు ప్రచారం చేయాలనుకుంటోంది. వీడియోలు కూడా రిలీజ్ చేస్తారో లేదో కానీ.. చట్ట పరంగా తేల్చుకోవడం కన్నా.. ప్రజల్లో బీజేపీని బద్నాం చేస్తే చాలన్నట్లుగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. అందుకే ఈ ఆడియో టేపుల గురించి కోర్టులో కూడా చెప్పలేదు.