నవంబర్లో ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఆయన వస్తున్న ప్రధాన కార్యక్రమం .. విశాఖలో రూ. నాలుగు వందల కోట్లతో నిర్మించబోతున్న ..లేదా ఆధునీకకరించబోతున్న రైల్వేస్టేషన్ పనులకు శంకుస్థాపన చేయడం కోసం. అంటే ఇప్పుడు ఉన్న రైల్వే స్టేషన్ భవనం స్థానంలో కొత్తది నిర్మిస్తారు. అయితే వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో మాత్రం .. రైల్వే జోన్కు శంకుస్థాపన చేయబోతున్నారన్న ప్రచారం చేస్తున్నారు. కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను ఎడిట్ చేసి రైల్వే స్టేషన్ స్థానంలో జోన్ అనే అక్షరాలు పెట్టి మభ్య పెట్టాలనుకుంటున్నారు.
రైల్వే జోన్ అంశానికి కేంద్ర కేబినెట్ ఎప్పుడో ఆమోదం తెలిపింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రాన్ని జోన్ అమలు చేయాలని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు.కనీస మాత్రంగా కూడా అడగలేదు. పలుమార్లు కేంద్రం జోన్ విషయంలో వ్యతిరేక ప్రకటనలు చేసినా ఢిల్లీలో స్పందించలేదు. ఏపీకి వచ్చి జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు ప్రకటించారు. కానీ ఈ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ప్రధానమంత్రి వస్తున్నా.. జోన్ కోసం కాదు. కానీ వైసీపీ నేతలు మాత్రం జోన్ కోసమేనని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
బోగాపురం ఎయిర్ పోర్టుకు టీడీపీ హయాంలోనే టెండర్లు పూర్తయ్యాయి. పనులు కొనసాగించి ఉంటే ఈ సారి సగానికి పైగా నిర్మాణం పూర్తయ్యేది. కానీ టెంజర్లు రద్దు చేసి.. భూములను తగ్గించి మళ్లీ పాత కాంట్రాక్టర్ జీఎంఆర్కే ఇవ్వడంతో కొత్తగా అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ అనుమతులు ఇంకా లేదు. ప్రధాని విశాఖకు వస్తున్నా.. ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయకపోతే.. వైసీపీ ప్రభుత్వానికి మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది.