సినీ నటుడు అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు. ఈ అంశానికి విస్తృత ప్రచారం లభించింది. కానీ ప్రతీ నెలలో ఒకరో ఇద్దరో సలహాదారులు నియమితులవుతూనే ఉన్నారు. ఈ నెలలోనే శింగనమల ఎస్సీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరి సాంబశివారెడ్డికి విద్యాశాఖలో సలహాదారు పదవి ఇచ్చారు… ఇలాంటి పదవుల నియామకం వరుసగా సాగుతోంది.
ఒక్కో సలహాదారుకు రూ. మూడు లక్షల పైనే జీతభత్యాలు !
లెక్కలు తీస్తే కనీసం వంద మంది సలహాదారులుంటారని చెబుతున్నారు. ఎంత మంది సలహాదారులున్నారో ప్రభుత్వం ఎప్పుడూ అధికారికంగా చెప్పలేదు. కానీ రాజకీయంగా పదవులు కల్పించలేని ప్రతి ఒక్కరికీ సలహాదారు ఇచ్చేస్తున్నారు. అదే సమయంలో ఇతర అవసరాలు తీర్చుకోవడానికీ సలహాదారు పదవి ఇస్తున్నారు. అప్పుల కోసం ఎస్బీఐ చీఫ్గా పని చేసి రిటైరైన వ్యక్తీ రజనీష్కు పదవి ఇచ్చారు. ఇలాంటి సలహాదారులకు ప్రభుత్వం ప్రజాధనాన్ని ఇస్తోంది. అదీ కూడా లక్షల్లో ఉటుంది. జీత భత్యాలు ఎలా లేదన్నా కనీసం రూ. మూడు లక్షలకుపైగానే ఉంటాయి. ఇలా ఏ పనీ చేయని వాళ్లకు… ఇలా లక్షలు ప్రజాధనం ఇచ్చేది ఎందుకో ఎవరికీ తెలియదు.
సలహాల పేరుతో కోట్ల ప్రజధానం బొక్కేసిన దేవులపల్లి అమర్
దేవులపల్లి అమర్ అనే జర్నలిస్టు నేత తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ ప్రజలను బూతులు తిట్టారు. వారు దోపిడీ దారులన్నారు. ఎన్ని మాటలనాలో అన్నీ అన్నారు. ఆయన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏ పనీ చేయకుండా.. సలహాదారుగా వ్యవహరిస్తూ.. కోట్ల రూపాయల ఏపీ ప్రజల సొమ్మును అప్పనంా పొందారు. ఆయన ఎప్పుడూ ఎవరికీ కనిపించరు. మూడు కార్యాలయాలు మెయిన్ టెయిన్ చేయడానికి డబ్బులిస్తారు. ఎలాంటి సలహాలిచ్చారో ఎవరికీ తెలియదు. అందరూ ఇలాంటి బాపతు సలహాదారులే. వీరికి ఎందుకు ఏపీ ప్రజలు పన్నులుగా కట్టిన రూ. కోట్లు ఇవ్వాలనేది ఎవరికీ అంతుబట్టని విషయం.
కోర్టు ఆక్షేపించినా మామూలే !
ప్రభుత్వ శాఖలకు సలహాదారులేమిటని.. ఇటీవల దేవాదాయశాఖకు ఓ సలహాదారుడ్ని నియమించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నియామకాన్ని కొట్టేసింది. నిజానికి ఈ తీర్పు అన్ని ప్రభుత్వ శాఖలకూ వర్తించాలి. కానీ ప్రభుత్వం దులిపేసుకుంది. మళ్లీ నియామకాలు చేస్తోంది. ప్రజాథనం పట్ల ఏ మాత్రం బాధ్యత లేని ప్రభుత్వం సొంత అవసరాలకు .. తమ పార్టీ నేతల రాజకీయ ఆకాంక్షలు తీర్చడానికి ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఎంత మంది సలహాదారులు ఉన్నా.. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే అందరి బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు.