ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. నవంబర్ 11వ తేదీన ఏపీలోని విశాఖపట్నంలో కొత్త రైల్వే స్టేషన్ శంకుస్థాపనకు హాజరు కానున్నారు. ఆ రోజు విశాఖలోనే బహిరంగసభలో పాల్గొననున్న మోదీ.. 12వ తేదీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసేందుకు రామగుండం రానున్నారు. ఇందు కోసం బీజేపీ నేతలు ఏర్పాట్లు ప్రాంభించారు. మూతబడిన ఈ ఫ్యాక్టరీని మోదీ ప్రత్యేకమైన ఆసక్తితో పునరుద్ధరణ చేయించారు. 2016 ఆగస్టు 7న పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఈ ఏడాదే ఫిబ్రవరిలోనే ఉత్పుత్తి కూడా ప్రారంభమయింది.
ఇప్పటికే పలుమార్లు రామగుండం పర్యటనకు మోదీ వస్తారని ప్రచారం జరిగినా వాయిదా పడుతూ వస్తోంది. కానీ ఈ సారి మాత్రం మోదీ రామగుండం పర్యటన ఖాయమయింది. ఇప్పటికే ఉత్పత్తి కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నందున.. జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో .. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు కావడం ఆసక్తి రేపుతోంది. మోదీ తెలంగాణ పర్యటనకు వస్తే కేసీఆర్ పాల్గొంటారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు.గతంలో పాల్గొనలేదు. పీలో రైల్వే స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో జగన్ పాల్గొంటున్నారు. ఇక్కడ కేసీఆర్ పాల్గొనడం మాత్రం డౌటేనని చెప్పవచ్చు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో తెలంగాణ ప్రభుత్వానికీ భాగస్వామ్యం ఉంది. అందుకే సీఎం ఖచ్చితంగా పాల్గొనాల్సి ఉంటుంది. మోదీ పర్యటన … ఆ తర్వాత బహిరంగసభ కూడా ఉండనుంది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీపై కేసీఆర్ మండి పడుతున్నారు. పోరాటం చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంమలో మోదీ పర్యటన హైలెట్ అయ్యే అవకాశం ఉంది.