రిషి మనవాడేనని.. మన దేశంలో శతాబ్దాలుగా సాగిన వలస పాలన, దోపిడిపై బ్రిటన్ ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటారన్నట్లుగా .. సూడో దేశభక్తులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ఇప్పుడు బ్రిటన్ ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది. గతంలోలా.. ఈ చర్చలు టీ కొట్లలో రచ్చబండల మీద సాగడం లేదు. సోషల్ మీడియాలో సాగుతోంది. ఫలితంగా రిషి సునాక్ గురించి ఇండియన్ల ” అతి ” స్పందనపై బ్రిటన్‌లో విస్తృత చర్చ జరుగుతోంది. పోయి పోయి బ్రిటన్ ప్రజలు రిషి సునాక్ అనే ఇండియన్‌కు అధికారం ఇచ్చామా అని అనుకునే పరిస్థితిని కల్పించేస్తున్నారు.
రిషి సునాక్ ఇండియన్ కాదు. ఆయన తల్లిదండ్రులు కూడా కాదు. తాత ముత్తాతలు ఇండియన్స్ కావొచ్చు. కానీ జన్మతహా కూడా బ్రిటన్ పౌరుడే. హిందువు అయి ఉండవచ్చు. కానీ భారతీయుడు.. బ్రిటన్ ను జయించేశారని… ఆ బ్రిటన్ మన పరిపాలనలోకి వచ్చిందన్నట్లుగా ఓవరాక్షన్ చేయడం ఆయనకే చేటు చేస్తోంది. అక్కడి ప్రజల్లోనూ అదే భావం ఏర్పడుతోంది. ఇది మరింత స్థాయికి వెళితే రిషి సునాక్ రాజకీయ జీవితాన్ని తెలియకుండానే భారతీయులే రిస్క్‌లో పెట్టినట్లు. ఇప్పుడు జరుగుతోంది. బ్రిటన్‌లోనూ ఇండియా ప్రజలు ఇలా అనుకుంటున్నారని.. భారతీయుడు బ్రిటన్ ఆక్రమించుకున్నారని చెప్పుకుంటున్నారని అనుకుంటే.. వివక్ష పెరిగిపోతుంది.
రిషి సునాక్.. బ్రిటన్ పౌరుడు. ఆయన పదవి చేపట్టినా బ్రిటన్ కోసమే పని చేస్తారు. ఇండియా కోసం పని చేయరు. కానీ సూడో దేశభక్తులు మాత్రం ఆయన ఇండియా కోసం పని చేస్తారని.. బ్రిటన్ వాళ్లు దోచుకెళ్లిన సంపద అంతా తిరిగి తెస్తారని ప్రచారం చేసేస్తున్నారు. ఆయన పూర్తిగా ఇండియన్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి చర్చలు బ్రిటన్‌లోనూ హైలెట్ అవుతున్నాయి. ఏరి కోరి మనం ఇండియన్‌కు పదవి ఇచ్చామా అని అక్కడి ప్రజలకూ అనుకుంటే.. రిషి సునాక్ కు చేసే చేటు అంత కంటే ఎక్కువ ఉండదు. దురదృష్టవశాత్తూ ఇప్పుడు అదే జరుగుతోంది.