సునీ ఇన్ ఫ్రాకు రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినందుకే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆ కంపెనీ .. పలువురు మునుగోడు నేతల ఖాతాల్లోకి రూ. ఐదు కోట్ల నగదు పంపిందని.. వాటిని ఓటర్లను పంచుతారని టీఆర్ఎస్ నేతలు ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు ఆ కంపెనీతో తనకేం సంబంధం రాజగోపాల్ రెడ్డి తేల్చేశారు .ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులకు ఆయన అదే సమాధానం ఇచ్చారు.
సుశీ ఇన్ ఫ్రా కంపెనీతో తనకు సంబంధం లేదని ఆయన ప్రకటించారు. ఆ సంస్థ ఎవరికి డబ్బులు పంపిందో తనకు తెలియదన్నారు. ఇవే వివరాలతో తాను ఎన్నికల సంఘానికి సమాధానం పంపానని… రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు అది తన కుమారుడి కంపెనీ అని.. ఆ కంపెనీ చేసే లావాదేవీలపై తనకు ఏ మాత్రం సమాచారం ఉండదన్నారు. రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన సమాధానాన్ని సమీక్షించి సంతృప్తి చెందకపోతే ఏదో ఓ చర్య తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ సంతృప్తి చెందితే మాత్రం ఎటువంటి చర్యలు ఉండవు.
మునుగోడు ఉపఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారాయి. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నుంచి మునుగోడుకు తరలిస్తున్నట్లుగా భావిస్తున్న రూ. కోట్లు పట్టుబడుతున్నాయి. హవాలా ఏజెంట్ల నుంచి ఈ నగదు తరలి పోతోంది. ఇలా పట్టుబడుతున్న సొమ్ము అంతా.. బీజేపీదేనని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.