ఓటీటీలో ఆహా.. వడివడిగా ముందడుగు వేస్తోంది. తెలుగులో మొట్టమొదటి ఓటీటీగా ప్రాచుర్యం సంపాదించుకొన్న ఆహా.. నిన్నా మొన్నటి వరకూ డబ్బింగ్ సినిమాలపై ఆధారపడింది. ఆ తరవాత వర్జినల్ కంటెంట్ నమ్ముకొంది. అందులో భాగంగా నందమూరి బాలకృష్ణతో అన్ స్టాపబుల్ అనే షో డిజైన్ చేసింది. అన్ స్టాపబుల్ సూపర్ హిట్ అవ్వడంతో.. ఈ తరహా టాక్ షోలకు ఆహా ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పుడు అన్ స్టాపబుల్ 2 కూడా దూసుకుపోతోంది. ఈ స్ఫూర్తితోనే.. దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ షో ప్లాన్ చేసింది. ఇప్పుడు బ్రహ్మానందంని రంగంలోకి దింపబోతున్నట్టు సమాచారం. బ్రహ్మానందంతో ఓ టాక్ షోని నిర్వహించడానికి ఆహా ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకు బ్రహ్మానందం కూడా ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆహా – బ్రహ్మానందం మధ్య డీల్ నడుస్తోంది. పారితోషికం, ప్యాకేజీ ఓకే అయితే.. వెంటనే ఈ షోని ప్రారంభిస్తారు. టాక్ షోస్ లో అనుభవం, ప్రావీణ్యం ఉన్న ఓ ముంబై టీమ్… ఈ షో కోసం పనిచేయబోతున్నట్టు టాక్.