ఈమధ్యే `ఓరి దేవుడా`తో పలకరించాడు విశ్వక్సేన్. తన చేతిలో దాదాపుగా అరడజను సినిమాలున్నాయి. వాటితో పాటు ఓ కొత్త సినిమాని ఒప్పుకొన్నాడు విశ్వక్. సాహిత్ అనే దర్శకుడితో ఓ ప్రాజెక్టు చేయబోతున్నాడు. `సవారీ` అనే సినిమాని రూపొందించాడు సాహిత్. ఆ సినిమా సరిగా ఆడలేదు కానీ… సాహిత్ టెక్నికల్ గా స్ట్రాంగ్ అనే సంగతి ఆ సినిమాతో తేలిపోయింది. ఇప్పుడు ఓ కాలేజీ బ్యాక్ గ్రౌండ్ లో సాగే కథతో విశ్వక్‌ని సంప్రదించినట్టు సమాచారం. ఈ సినిమాకి `స్టూడెంట్` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. విశ్వక్ చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. `దమ్కీ` అనే సినిమా సెట్స్‌పై ఉంది. దీనికి తనే దర్శకుడు. అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇవన్నీ అయ్యాకే.. `స్టూడెంట్` సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ సినిమాకి దాదాపు రూ.25 కోట్ల వరకూబడ్జెట్ అవసరమని సమాచారం. ఈ సినిమాని తానే స్వయంగా నిర్మించాలని విశ్వక్ భావిస్తున్నాడట.