హైదరాబాద్: ఇటీవల తెలుగుదేశంలో చేరిన నెల్లూరు సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే రోజాపై విమర్శలు గుప్పించారు. బజర్దస్త్ ప్రోగ్రామ్లోలాగా రాజకీయాలలో కూడా కామెడీ చేస్తున్నారని అన్నారు. సినిమా ఛాన్సులు లేక ఆమె టీవీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారని, జబర్దస్త్ ప్రోగ్రామ్ అయిపోతే జగన్ ప్రోగ్రామ్లలో రికార్డ్ డ్యాన్సులే మిగులుతాయని ఎద్దేవా చేశారు. అప్పుడు రోజా మేకప్, వైసీపీ ప్యాకప్, జగన్ లాకప్ అవటం ఖాయమని అన్నారు. జగన్ తమను ఎదుర్కోలేక రోజాను ప్రయోగిస్తున్నారని విమర్శించారు. జగన్ను 130 ఏళ్ళ కాంగ్రెస్, 33 ఏళ్ళ టీడీపీ ఏమీ చేయలేకపోయాయని, రోజా పాదం మోపటంతో వైసీపీ సర్వనాశనమవుతోందోని అన్నారు. ఆమె ఎక్కడ కాలు మోపితే అక్కడ నాశనమవటం ఖాయమని చెప్పారు. ఆమె వైసీపీలోకి చేరిన తర్వాతే టీడీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. దీనికి రోజా ఏమి బదులిస్తారో చూడాలి.