ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. తన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా మొదలవ్వకముందే బిజినెస్ పూర్తయిపోయే స్టామినా ఉంది. ప్రభాస్ ఎప్పుడు ఏం చేస్తాడా అంటూ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి ప్రభాస్ సినిమా `లో ప్రొఫైల్`లో జరిగిపోతోంది.
ప్రభాస్ – మారుతి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. అసలు ఈ సినిమా ఉంటుందా? లేదా? అని అనుమానించారంతా. కానీ గుట్టు చప్పుడు కాకుండా ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది. ఓ వారం రోజులు షూటింగ్ జరుపుకొంది. ప్రభాస్ కూడా సెట్లో అడుగు పెట్టాడు. ఈ నెలలోనే మరో షెడ్యూల్ మొదలు కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ గా ఎలాంటి ఎనౌన్స్మెంట్ చేయలేదు. కనీసం ఓపెనింగ్ కి కూడా మీడియాని దూరంగా ఉంచారు. కారణం.. ప్రభాసే. ఈ సినిమాని లో ప్రొఫైల్ లో చేయమని ప్రభాస్ సలహా ఇచ్చాడట. దానికీ కారణం ఉంది. ఇప్పటికే తన సినిమాలు చాలా సెట్స్‌పై ఉన్నాయి. సలార్, ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్.. ఈ సినిమాలకు సంబంధించిన వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. వీటి మధ్య మారుతి సినిమా కూడా ప్రకటిస్తే – అభిమానులు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకేసారి ఇన్ని సినిమాలు సెట్స్‌పై ఉండడం కూడా ఓరకమైన ఇబ్బందే. అందుకే ఆదిపురుష్, సలార్ పనులు అయ్యాక… మారుతి సినిమా లైమ్ లైట్ లోకి రావాలన్నది ప్రభాస్ ఆలోచన. అందుకే ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్ డేటూ.. చిత్రబృందం అధికారికంగా ఇవ్వడం లేదు. 2023 ప్రధమార్థం నుంచి… మారుతి సినిమాకి సంబంధించిన అప్ డేట్లు బయటకు వస్తాయి.