జాతిరత్నాలుతో ఆకట్టుకొన్నాడు అనుదీప్. తన సెన్సాఫ్ హ్యూమర్ అందరికీ నచ్చింది. వేదికలపై కూడా అనుదీప్.. అదే స్టైల్ లో మాట్లాడుతుంటాడు. రెండో సినిమాకే.. శివ కార్తికేయన్‌ని డైరెక్ట్ చేశాడు. `ప్రిన్స్` పెద్దగా ఆడలేదు కానీ, ఆ సినిమాలోనూ అనుదీప్ తనదైన, తనకు మాత్రమే సాధ్యమైన కామెడీ టైమింగ్ చూపించాడు. ప్రిన్స్ ఫ్లాప్ అయినా… అనుదీప్‌కి అవకాశాలు తగ్గలేదు. ఇప్పటికే మూడు అగ్ర నిర్మాణ సంస్థల దగ్గర అడ్వాన్సులు తీసుకొన్నాడు. ఎక్కడ, ఏ హీరో ఫైనల్ అయితే ఆ హీరోతో సినిమాని పట్టాలెక్కిస్తాడు.
అయితే అనుదీప్ దగ్గర రామ్ కి సరిపడ కథ ఉంది. రామ్ కూడా అనుదీప్ తో సినిమా చేయడానికి ఉత్సామం చూపిస్తున్నాడు. రామ్ కి రొమాంటిక్ ఎంటర్టైనర్లు బాగా కలిసొచ్చాయి. ఆ జోనర్లో సమర్థవంతంగా నడిపించగలడు అనుదీప్. అందుకే ఈ కాంబో దాదాపుగా సెట్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే… ఇప్పటికిప్పుడు ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లదు. ఎందుకంటే.. రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. బోయపాటితో సినిమా అంటే దాదాపుగా యేడాదైనా కేటాయించాలి. ఆ తరవాతే.. అనుదీప్ ప్రాజెక్టు ఉంటుంది. ఈలోగా అనుదీప్ మరో సినిమాతో సినిమా చేసుకోవొచ్చు.