ఎందుకనో తమిళ హీరో.. విష్ణు విశాల్ అంటే రవితేజకు ప్రత్యేకమైన అభిమానం. విష్ణు విశాల్ గత సినిమా.. ఎఫ్.ఐ.ఆర్ సినిమాని రవితేజ తెలుగులో బాగా ప్రమోట్ చేశాడు. ఈసినిమాకి సమర్పకుడిగానూ వ్యవహరించాడు. అంతేకాదు,… విష్ణు విశాల్ చేయబోయే సినిమాలన్నింటికీ తెలుగులో తను నిర్మాతగా వ్యవహరిస్తానని మాట ఇచ్చాడు. అన్నట్టుగానే.. ఇప్పుడు విష్ణు విశాల్ నుంచి వస్తున్న `మట్టి కుస్తీ` సినిమాకి తానో నిర్మాగా మారిపోయాడు. కుస్తీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. రవితేజ టీమ్ వర్క్స్ ఈ సినిమాని తెలుగులో అందిస్తోంది. చెల్ల అయ్యవు దర్శకత్వం వహించారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించింది. ఈరోజు.. రవితేజ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే సినిమా ఇది. అక్కడ జరిగే కుస్తీ పోటీలు, వాటి చుట్టూ నడిచే రాజకీయాలు… ఈ సినిమాలో చూపించబోతున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. విష్ణు విశాల్ `ఎఫ్.ఐ.ఆర్` తెలుగులో అనుకొన్న స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయినప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకొంది. ఇప్పుడు ఈ కుస్తీ కథ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.