దేవిశ్రీప్రసాద్ బాలీవుడ్లో ఇటీవల తన ప్రతిభను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. పుష్ప పాన్ ఇండియా హిట్ కావడం.. అందులో ఐటం సాంగ్‌కు మంచి పేరు రావడంతో ఆయనకు అవకాశాలు వస్తున్నాయి. టీ సిరీస్ చీఫ్ భూషణ్ కుమార్ పిలిచి మరీ ఓ వీడియో సాంగ్ చేసే చాన్స్ ఇచ్చారు. అందులో దేవీశ్రీనే నటించారు. ఈ వీడియో సాంగ్ నాలుగువారాల కిందట యూట్యూబ్‌లో విడుదలై.. ఇరవై మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. ఇంత హిట్ అయిన ఈ సాంగ్‌పై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ వీడియోను డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తోంది.
బీజేపీ డిమాండ్‌కు ప్రధాన కారణం బీజేపీ చాలా పవిత్రంగా భావించే దేవుడి పాటను పేరడిచేసి అసభ్యంగా పెట్టారట. అందుకే ఆ పాటను డిలీట్ చేయాలంటున్నారు. కోట్లాదిమంది జపించే హరే రామ హరే కృష్ణ పవిత్ర మంత్రాన్ని ఒక ఐటెం సాంగ్ కి పాడుతూ, బికినీలపై డ్యాన్స్ చేస్తూ కోట్లాదిమంది హిందువుల యొక్క మనోభావాలను గాయపరిచే విధంగా పాటను చిత్రీకరించారనేది ప్రధాన ఆరోపణ. బీజేపీ జాతీయ బీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్న పార్థసారధి ఈ డిమాండ్‌ను వినిపించారు. హిందీలో ఉన్న సాంగ్‌లో … అభ్యంతరకర పదాలున్నాయనేది బీజేపీ అభ్యంతరం.
అయితే హిందీ లిరిక్స్ ఉన్న సాంగ్‌లో అంత అభ్యంతరం ఉంటే.. హిందీ వాళ్లు ఊరుకుంటారా అన్నది ప్రధాన సందేహం. నాలుగు వారాల తర్వాత బీజేపీ నేతలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడం అంటే.. ఈ పాటకు మరింతగా ప్రచారం కల్పించడమేననే వాదన వినిపిస్తోంది. అయితే బీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్న పార్థసారధి రెడ్డి మాత్రం.. వీడియోను తక్షణం అన్ని మాధ్యమాల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.