బడ్జెట్‌కు ముందు సమర్పించిన ఆర్థిక సర్వే ప్రకారం చూస్తే పరీక్ష ఆయనకు మీరంతా సూపర్ రిచ్ .
.మొదటి సంగతి లక్ష కోట్ల రూపాయల సబ్సిడీ సంపన్నులకు పోతుంది గనక దాన్ని కోత కోయాలని స్పష్టంగా వుంది. ఏవేవో తప్పు లెక్కలతో దేశ జనాభాలో 70 శాతం సంపన్నులని తేల్చారు. ఇది నిజం కాదని అందరికీ తెలుసు. నిజంగా 70 శాతం జనాభా సంపన్నులై వుంటే ఈ దేశం ఇలా వుండేది కాదు. మామూలు బాషలో వాస్తవం ఇందుకు రివర్స్. 70 శాతం ఎంతో కొంత పేద మధ్యతరగతిలో వుండగా 30 శాతమే సంపన్నులు.
.సర్వేలో మరో వింత వ్యాఖ్యానం చేశారు. మనం మధ్య తరగతిగా భావించేవారు విదేశాల లెక్కలలో మధ్యతరగతి తప్ప మన దేశంలో పరిస్థితి ప్రకారం చూస్తే మహా సంపన్నులు(సూరప్ రిచ్) అనుకోవాలట. వీరందరికీ కిరోసిన్, గ్యాస్,విద్యుత్ సబ్సిడీలు ఎత్తివేయడం ఎలాగన్నదే విపరీతంగా చర్చించారు.
.గ్యాస్‌పై ఇచ్చే సబ్సిడీలో 91 శాతం సంపన్నులకే పోతుందట.
.రైల్వేలలో అన్ రిజర్వుడు ప్రయాణీకులే పేదలుగా స్లీపర్ నుంచి ఎసి వరకూ తీసుకునేవారంతా సంపన్నులుగా పరిగణించారు.
.మధ్యతరగతి వారు ఆదాయపు పన్ను పరిమితిని పెంచాలని కోరుతుంటే ఆర్థిక సర్వే మాత్రం మరింత మందిపై ఆదాయపు పన్ను విధించేలా విస్తరించాలని చెబుతున్నది.
.చిన్న పొదుపు మొత్తాలు కూడా సంపన్నులకే మేలు చేస్తున్నాయి గనక వాటిపైనా కూడారాయితీలు తొలగించాలంటుంది.