ఫామ్ హౌస్ కేసులో బయటపెట్టింది కొంతేనని.. బయట పెట్టాల్సింది పాన్ ఇండియా సినిమా అంత ఉందని కేసీఆర్తో పాటు కేటీఆర్ కూడా ఏదో ఓ సందర్భంలో ప్రతీ రోజూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బీజేపీ నేతల్ని ఓ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా వారి మాటలు ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్ బెదిరింపుల తరహా మాటలు.. బీజేబీ హైకమాండ్ స్థాయికి వెళ్లాయో లేదో కానీ… వారు సీరియస్గా తీసుకుంటే మాత్రం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతాయని భావిస్తున్నారు.
మునుగోడులో ఎన్నికల ఫలితం టీఆర్ఎస్కు తే్డా వస్తే.. ఆ తర్వాత ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం అంత తేలిక కాదు. అక్కడ టీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలిస్తే మాత్రమే కాస్త బలం ఉంటుంది. గట్టి పోటీ ఎదుర్కొన్నా.. అరకొరగా బయటపడినా.. కష్టమవుతుంది. నిజానికి.. ఫామ్ హౌస్ కేసులో అమిత్ షా వాయిస్ ఉన్నా చేయడానికి ఏమీ ఉండదని.. నిపుణులు చెబుతున్నారు.. తమ పార్టీలో చేరమని ఆహ్వానించి ఉంటారని… అది ఎలా తప్పవుతుందన్నది ఎక్కువ మంది అభిప్రాయం.
అయితే అసలు అక్కడ దృశ్యాలు.. ఉన్నాయో లేదో.. లేకపోతే.. మునుగోడు తర్వాత ఢిల్లీ ప్రెస్ మీట్ పెట్టి రీలీజ్ చేస్తారో కానీ.. ఇప్పటికే ఈ కేసు తేలిపోయింది. పోలీసులు చాలా తేలిగ్గా తీసుకున్నారు. పైగా ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చింది. హైకోర్టులోనూ పిటిషన్ పడింది. రాజకీయాల్లో ఇలా బెదిరింపులు ప్రతీ సారి వర్కవుట్ కావు. పైగా .. రెండు ప్రభుత్వాలు నడుపుతున్న వారి మధ్య బెదిరింపులు అంటే.. చివరికి రివర్స్ అవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువ అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వారిదే పైచేయి అవుతుంది.
మోదీ, అమిత్ షాల బ్యాక్ గ్రౌండ్ గురించి పూర్తి అవగాహన ఉన్న నేతలు.. వారిని ప్రజాక్షేత్రంలో కాకుండా ఇలా ఆడియోలు.. వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి.. ఏదో చేద్దామనుకుంటే.. వారిని వెనక్కి తగ్గేలా చేద్దామనుకుంటే.. అంతకు మించిన తెలివి తక్కువ రాజకీయం ఉండనది బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.