ఏపీ ప్రభుత్వం మద్య నిషేధం చేయకపోగా ఆదాయంకోసం అమ్మకాలు మూడింతలు పెంచంది.ఇప్పుడు పనిలో పనిగా గుట్కా, ఖైనీల నుంచీ ఆదాయాన్ని పొందేందుకు ప్లాన్ చేస్తోంది. వీటి నిషేధంపై కోర్టులో వచ్చిన వ్యతిరేక ఉత్తర్వులపై స్పందించకుండా ప్రభుత్వం ఉండిపోయింది. అమ్మకాలపై ఎలాంటి కేసులు పెట్టవద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.దీంతో ఏపీలో బహిరంగంగానే గుట్కా, ఖైనీలు అమ్మకాలు జరిగే అవకాశం ఉంది.వీటిపై పెద్ద ఎత్తున పన్నులు విధించడం ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చన్న ఆలోచన ఏపీ ప్రభుత్వం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
గుట్కా, ఖైనీల వల్ల పెద్ద ఎత్తున ప్రజల ఆరోగ్యం చెడిపోతోందన్న ఉద్దేశంతో గతంలో నిషేధం విధించారు. అయితే అక్రమార్కులు.. ముఖ్యంగా రాజకీయ నేతల అండదండలుఉన్నవారు ఖైనీ,గుట్కాలను తయారు చేయడం.. అక్రమంగా రవాణా చేయడం మాత్రం ఆపలేదు. పై స్థాయిలోని వారే ఇలా చేయడంతో .. రేట్లను పెంచి రిటైల్‌గా అమ్మేవారు. చాలా చోట్ల .. పాన్ షాపులపై ఇలాంటివి అమ్ముతున్నందుకు కేసులు పెట్టేవారు. కొన్నిసార్లు జైళ్లలో కూడా పెట్టేవారు. అయితే ఇప్పుడు హైకోర్టు పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం లేదన్న ఉత్తర్వు రావడంతో.. దానిపై ప్రభుత్వం సవాల్ చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే చేయలేదన్న వాదన వినిపిస్తోంది.
మద్యనిషేధం..నియంత్రణ చేయాలనుకున్నప్పుడు మొదట్లో ప్రభుత్వం.. లాటరీలను మళ్లీ తీసుకు రావాలనుకుంది. కొంత మంది అధికారులను లాటరీలు ఉన్న కేరళ.. ఈశాన్య రాష్ట్రాలకు పంపించి..పరిశీలన కూడా చేయించారు. కానీ అది మరీ తేడాగా ఉంటుందన్న ఉద్దేశంతోనే.. అనుకున్నతంగా ఆదాయం రాదనో కానీ ఆగిపోయారు. చివరికి మద్యనిషేధం విషయంలో మడమ తిప్పడానికే సిద్ధమయ్యారు. ఇప్పుడు అదనపు ఆదాయం కోసం గుట్కాలకూ అధికారికంగా చేయబోతున్నారు.