ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ ..సింపుల్గా ఐఎస్బీ రెండు దశాబ్దాల ఉత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆహ్వానం పలికారు. ఐఎస్బీ నుంచి ఉన్నత స్థాయి బృందం చంద్రబాబు నివాసానికి వచ్చి ఈ మేరకు పిలిచారు. ఇలా పిలవడం ఆశ్చర్యమే. ఎందుకంటే ఇప్పటివరకూ ఆయనకు పెద్దగా క్రెడిట్ ఇవ్వడానికి .. రాజకీయాలు సహకరించలేదు. ఇప్పుడు పరిస్థితి మారిందా.. లేదా వ్యవస్థాపనకుసహకరించిన వారిని గౌరవించాలని ఇప్పుడనుకున్నారో కానీ ఆయనకూ పిలుపు వచ్చింది.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ .. ప్రపంచంలో ఉన్న గొప్ప బిజినెస్ స్కూల్స్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న సంస్థ. ఈ సంస్థ హైదరాబాద్కు రావడానికి ప్రధాన కారణం చంద్రబాబు. అయితే రాజకీయాలు మాత్రం ఈ ఘనతను ఆయనకు ఇవ్వడానికి ఎప్పుడూ అంగీకరించవు. ప్రభుత్వాలు మారిన తర్వాత ఐఎస్బీ క్రెడిట్ వేరేవాళ్లు తీసుకోలేకపోయారు కానీ.. చంద్రబాబు పేరును మరుగున పడేలా చేయగలిగారు ఈ అంశంపై ఐఎస్బీ మొదటి బ్యాచ్ విద్యార్థులతో పాటు పలువురు పారిశ్రమికవేత్తలు కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తూనే ఉంటారు.
ఇటీవల మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కూడా ఐఎస్బీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తరవాత ఐఎస్బీ వృద్ధికి సహకరించిన అందరి ఫోటోలు ఉన్నాయి కానీ.. చంద్రబాబు ఫోటో లేకపోవడం వెలితిగా ఉందన్నారు. ఆ సంస్థ ఏర్పాటులో వచ్చిన లీగల్ సమస్యల్ని తానే డీల్ చేశానని.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎంత కష్టపడ్డారో తెలుసని ఆయన అన్నారు. ఆ వ్యాఖ్యల తర్వాత చంద్రబాబు ఫోటో పెట్టారో లేదో కానీ.. ఇప్పుడైతే.. ఆహ్వానం పంపారు.
ఐఎస్బీకి ప్రభుత్వాలు సాయం చేయవు. ప్రసిద్ధ పారిశ్రామిక వేత్తల బోర్డు ఉంటుంది, అయితే .. ప్రభుత్వ ప్రభావం లేకుండా మాత్రం ఉండదు. ఎందుకంటే అందరూ దిగ్గజ పారిశ్రామికవేత్తలే.