కార్తికి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. పోన్నియన్ సెల్వన్ లో ఎప్పటికీ నిలిచిపోయే పాత్ర దక్కింది. సర్దార్ తో దీపావళి విజేతగా నిలిచాడు కార్తి. ఇప్పుడు ఆయన కొత్త సినిమాతో ప్రారంభమైయింది. రాజు మురగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పేరు జపాన్. డ్రీమ్వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఆ ప్రొడక్షన్ హౌస్ లో కార్తి చేస్తున్న ఆరో సినిమా ఇది. అలాగే కార్తికి ఇది 25వ సినిమా.
కార్తి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. అలాగే సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. జివి ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్, ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ లాంటి ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. రాజు మురగన్ తీసిన ‘జోకర్’ చిత్రానికి జాతీయ అవార్డ్ వచ్చింది. వినోదంతో పాటు సందేశాత్మక చిత్రాలు తీయడంతో అతనికి మంచి పేరుంది. జపాన్ కోసం కూడా ఇలాంటి కథని ఎంచుకున్నారని తెలుస్తోంది.