బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట.. ముఖ్యంగా బీజేపీతో తలపడే పార్టీలు అధికారంలో ఉన్న చోట…. గవర్నర్లు చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. గతంలో బెంగాల్ లో ధన్కడ్ వ్యవహరించిన విధానం చూశారు. తమిళనాడులో అలాగే ఉంది. ప్రస్తుతం కేరళలో అయితే.. గవర్నర్ మంత్రుల్ని తీసేయాలని కూడా ఆదే్శాలిస్తున్నారు. జార్ఖండ్‌లో అయితే్ ప్రభుత్వాన్ని కూల్చే పనిలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణలోనూ గవర్నర్ అదే చేస్తున్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లలను అటు తిరస్కరించకుండా.. ఇటు ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టుకుని.. వివరణ ఇవ్వాలంటూ మంత్రులకు సమాచారం ఇస్తున్నారు.
యూనివర్శిటీలకు సంబంధించిన ఓ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. చట్ట ప్రకారం.. రాజ్యాంగం ప్రకారం యూనివర్శిటీలకు చాన్సలర్‌గా గవర్నర్ ఉంటారు. కానీ అది గౌరవ మర్యాదల వరకే. పాలన అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. అయితే ఈ విషయంలో గవర్నర్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఈ బిల్లులపై చర్చించాలని.. కొన్ని డౌట్స్ క్లియర్ చేయాలని విద్యా మంత్రి సబితకు ఆదేశాలిచ్చారు. అయితే సబిత మాత్రం తనకు ఎలాంటి ఆదేశాలు .,లేఖ రాలేదని.. తాను రాజ్ భవన్‌కు ఎందుకు వస్తానని ఆమె అంటున్నారు. కానీ రాజ్ భవన్ మాత్రం ఆమెను పిలిచామని అంటోంది.
ఒక్క యూనివర్శిటీ సవరణ బిల్లులే కాకుండా.. మరో నాలుగైదు బిల్లులు రాజ్ భవన్‌లోనే ఉన్నాయి. గత అసెంబ్లీ సమావేశాలు ముగిసినప్పటి నుంచి అంతే ఉన్నాయి. వాటికి గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే గెజిట్ విడుదల చేసి అమలు ప్రారంభిస్తారు. ఒక వేళ వాటిని ఆమోదించకపోతే.. వెనక్కి పంపితే.. తెలంగాణ సర్కార్ ఏం చేయాలనుకుంటుందో అది చేస్తుంది. కానీ అటు ఆమోదించకుండా.. ఇటు తిరస్కరించకుండా తమిళిసై చేస్తున్న రాజకీయం టీఆర్ఎస్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమెను పట్టించుకోకపోవడమే మంచిదని నిర్ణయానికి వచ్చేశారు.