సంతోష్ శోభన్ మంచి నటుడు. తన మొదటి సినిమా గోల్కొండ హైస్కూల్ నుంచే ప్రతిభ చాటాడు. అయితే ఇప్పటికీ సరైన విజయం మాత్రం అందులేదు. పేపర్ బాయ్ మంచి పేరు తెచ్చి గానీ సూపర్ హిట్ అనే సినిమా కాదు. ఎక్ మినీ కథ ఓటీటీకి పరిమితమైతే మంచి రోజులొచ్చాయి సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ కూడా ఫ్లాఫ్ లిస్టులో చేరింది.
మంచి కామెడీ ఎంటర్ టైనర్లు తీస్తాడని పేరున్న మేర్లపాక గాంధీ ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ని చాలా పేలవంగా తెరకెక్కించాడు. మొదటి ఆట తర్వాత ఈ సినిమా ఊసేలేకుండా పోయింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు సంతోష్. ప్రమోషన్స్ లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఇది నేను గర్వంగా చెప్పుకునే సినిమాని చెప్పాడు. కానీ ఫలితం మాత్రం చాలా డిస్సాపాయింట్ చేసింది. ఇప్పుడు సంతోష్ ఆశలన్నీ నందిని రెడ్డి ‘అన్నీ మంచి శకునములే’ పై వున్నాయి. డిసెంబర్ లో ఈ సినిమా వస్తోంది.