ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు పెంచింది. మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. వీరిలో ఒకరు శరత్ చంద్రారెడ్డి. ఈయన విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు. అరబిందో ఫార్మా డైరక్టర్. మరోకరు తెలంగాణకు చెందిన వినయ్ బాబు. వీరిద్దరూ పెద్ద ఎత్తున బ్లాక్ మనీని వైట్ చేయడానికి .. ఢిల్లీ లిక్కర్ లాబీలో పెట్టుబడులు పెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దాదాపుగా రూ. రెండు వేల కోట్ల వరకూ అరబిందో నుంచి .. ఢిల్లీ లిక్కర్ సిండికేట్‌లోకి ప్రవహించాయని తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇప్పటికి మూడు అరెస్టులు జరిగాయి. తెలంగాణ అధికార పార్టీ పెద్దలకు బినామీగా భావిస్తున్న రామచంద్ర పిళ్లైను అరెస్ట్ చేయలేదు. కానీ అభిషేక్ రావును అరెస్ట్ చేశారు. రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారేందుకు అంగీకరించారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన చాలా విషయాలు సీబీఐకి చెప్పారని అంటున్నారు. అందుకే అభిషేక్ రావును అరెస్ట్ చేశారని .. శరత్ చంద్రారెడ్డిలపై కూడా స్పష్టమైన ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. వైసీపీ ఎంపీ లిక్కర్ వ్యాపారి మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కూడా ప్రశ్నించింది.
అరబిందో శరత్ చంద్రారెడ్డి.. విజయసాయిరెడ్డి అల్లురు రోహిత్ రెడ్డి ..సోదరుడు. అరబిందోలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయనకు అరెస్ట్ ముప్పు పొంచి ఉంది. అల్లుడి సోదరుడ్ని కాపాడేందుకు విజయసాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. మోదీ విశాఖ పర్యటన సందర్భంగా .. పర్యటన విజయవంతం చేసే బాధ్యతను విజయసాయిరెడ్డి తీసుకున్నారు. కానీ మోదీ ఏపీకి రాక ముందే అల్లుడి సోదరుడ్ని అరెస్ట్ చేశారు.
అరబిందో వ్యవహారాల్లో.. విజయసాయిరెడ్డి పాత్ర కీలకంగా ఉంటుందన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి లెక్కల ధాటికి అరబిందో ఫార్మా.. మరో సత్యం సంస్థలా అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.