ఢిల్లీ లిక్కర్ స్కామంలో వైసీపీకి ఏం సంబంధం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి కవర్ చేసుకున్నారు. ఢిల్లీలో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడు కాదన్నారు. విజయసాయిరెడ్డికి ఒక్కతే కూతురు ఉందని ఆయన అల్లుడి పేరు రోహిత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు అరెస్ట్ అయింది రోహిత్ రెడ్డి అన్న శరత్ చంద్రారెడ్డి అన్నారు. అరబిందో అనేది అతి పెద్ద అంతర్జాతీయ వ్యాపార సంస్థ అని.. విజయసాయి విజయసాయిరెడ్డి వాళ్ళకి బంధువే కానీ.. వాళ్ళ వ్యాపార సంస్థ ఈయన కు సంబంధం ఏంటని మీడియాను సజ్జల ఎదురు ప్రశ్నించారు.
ఇలాంటి లాజిక్కులు వ్యాక్సిన్‌కు కులాలు అంటగట్టి.. బంధుత్వాలు కలిపినప్పుడు ఎందుకు గుర్తు లేవో కానీ ఇప్పుడు మాత్రం ఆయన అసువుగా చెప్పేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఢిల్లీ, కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చాలా కాలంగా పొలిటికల్ వార్ జరుగుతుంోదని.. దానికి ఏపి ప్రభుత్వం కి, వైసీపీ కి, విజయసాయిరెడ్డి, జగన్ లకు ఏమీ సంబంధమని సజ్జల చెప్పుకొచ్చారు. అయితే శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో ఏపీలోని మద్యం మాఫియాకు లింక్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. అది బయటకు వస్తే సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.
ఏపీ మద్యం మొత్తం ప్రభుత్వ అధీనంలో ఉంది. కొన్ని బ్రాండ్లు మాత్రమే అమ్ముతున్నారు. మద్యం తయారీ.. అమ్మకాలు.. ఇలా మొత్తం అధికార పార్టీ నేతల గుప్పిట్లోనే ఉన్నాయి. అమ్మకాలు కూడా పూర్తిగా నగదు రూపంలో జరుగుతున్నాయి. దీంతో స్కాం జరిగిందన్న ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. శరద్ చంద్రారెడ్డికి లిక్కర్ బిజినెస్ ఉందని.. ఈ కేసులో ఆయన పేరు బయటకు వచ్చే వరకూ ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన దొరికిపోయారు. లెక్కలేన్నీ తేలిన తర్వాతే అసలు గుట్టు బయటపడుతుంది.