మోదీని కలవాలని పవన్ అనుకోలేదు. కలుస్తానని అపాయింట్మెంట్ అడగలేదు. కానీ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి జనసేన అధినేతకు సమాచారం వచ్చింది. శుక్రవారం సాయ్తంత్రం ఐఎన్ఎస్ డేగలో కలుద్దామని సమాచారం పంపారు. ప్రధాని పిలిచారు కాబట్టి… తిరస్కరించే అవకాశం లే్దు. పవన్ వెళ్తున్నారు. కానీ మోదీకి పవన్ ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారన్నది ఇప్పుడు కీలకమైన ప్రశ్న.
ఇన్నేళ్లలో ఒక్క సారి కూడా పవన్‌కు అపాయింట్మెంట్ ఇవ్వని ప్రధాని
ప్రధాని మోదీపై పవన్‌కు ఎంతో నమ్మకం. ఎంత నమ్కకం అంటే.. తాను అడిగితే కనీసం ఓ పది నిమిషాల అపాయింట్మెంట్ అయినా ఇస్తారని నమ్మకం. అందుకే టీడీపీ హయాంలోనే .. వివిధ వర్గాలను కలిసినప్పుడు తాను ప్రధానని కలిపిస్తానని మాట ఇచ్చే వారు. ఇలా ధర్మవరం చేనేతల దగ్గర్నుంచి అనేక మందికి చెప్పారు. కానీ వాస్తవం ఏమిటంటే… స్వయంగా పవన్ కల్యాణ్ కూడా మళ్లీ ప్రధాని మోదీని కలుసుకోలేకపోయారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత చాలా సార్లు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని అపాయింట్ కోసం ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేదు. తర్వాత పవన్‌కే విరక్తి పుట్టి అడగడం మానేశారు.
తెలుగు రాష్ట్రాలకు వచ్చినా పవన్‌ను పట్టించుకోని బీజేపీ పెద్దలు!
ఒక్క ప్రధాని మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాలకు ఏ బీజేపీ ముఖ్య నేత వచ్చినా పవన్ కల్యాణ్‌ను పట్టించుకోరు. కనీస ప్రస్తావన తీసుకు రారు. బీజేపీ కార్యక్రమం అయినా పొత్తులో ఉన్నందున.. కనీసం ఆహ్వానించాలన్న ఆలోచన మాత్రం చేయరు. జేపీ నడ్డా వచ్చినా.. అమిత్ షా వచ్చినా.. మోదీ వచ్చినా అదే తీరు. దీంతో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశపూర్వకంగా బీజేపీ అవమానిస్తోందన్న అభిప్రాయానికి జనసైనికులు ఎప్పుడో వచ్చారు.కానీై ఇప్పుడు మాత్రం అనూహ్యంగా పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం పంపారు.
టీడీపీకి దగ్గర కాకుండా నిలువరించే ప్రయత్నమేనా ?
ప్రస్తుతం జనసేన బీజేపీకి దూరమయింది. వ్యూహం మార్చుకుంటున్నానని పవన్ ప్రకటించారు. అయితే బీజేపీ మాత్రం పవన్‌తో కలిసే పోటీ చేస్తామంటున్నారు. ఈ క్రమంలో మోదీ .. పవన్‌ను బీజేపీతోనే ఉండేలా చూస్తారని… టీడీపీతో వెళ్లకుండా మాట్లాడతారని అంటున్నారు. అదే జరిగితే వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే. వైసీపీ కోసమే బీజేపీ ఇలాంటి ప్లాన్ చేస్తోందని.. పవన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కావడంతోనే బీజేపీ రాజకీయం చేస్తోందన్న అనుమానాలు ప్రారంభమవుతున్నాయి. మొత్తంగా ఏపీ రాజకీయం మాత్రం భిన్నంగా ఉండబోతోంది.