తెలంగాణలో ఈడీ, ఐటీ దాడుల కలకలం రేగుతోంది. ముందుగా గ్రానైట్ వ్యాపారులను టార్గెట్ చేశారు. గ్రానైట్ వ్యాపారం అంటే్నే ఎన్నో లొసుగులు ఉంటాయి. అయితే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే సంబంధం ఉంటుంది. కానీ కేంద్రంతో ఉండదు. అయితే గ్రానైట్ అంటే ఎక్కువ ఎగుమతలు. ఇలా ఎగుమతి చేసినప్పుడు కేంద్రం జోక్యం ఉంటుంది. ఇక్కడే ఈడీ పట్టుకుంది. ఎక్కువ ఎగుమతి చేసి.. తక్కువ చూపి పన్నులు ఎగ్గొట్టారన్న లాజిక్ ఈడీ పట్టుకుంది. ఈ కోణంలో దర్యాప్తు ప్రారంభించింది.
నిజానికి గ్రానైట్ వ్యాపారులందరూ ఈ తరహా అక్రమాలకు పాల్పడతారు. అందుకే రాజకీయ నాయకులకు.. పార్టీలకు వారు నిధులు సర్దుబాటు చేస్తారు.కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది. అందుకే దాడులు తప్పడంలేదు. టీఆర్ఎస్తో సంబంధం ఉన్న గ్రానైట్ కంపెనీలను టార్గెట్ చేశారు. మొన్నటి వరకూ కాంగ్రెస్‌లో ఉండి.. టీఆర్ఎస్లో చేరి.. స్వల్ప కాలానికి ఎంపీ అయిన గాయత్రి రవి, గంగుల కమలాకర్‌లపై గురి పెట్టారు. అనుకున్న విధంగా సోదాలు చేసి అధారాలు సేకరించారు. గాయత్రి రవి రాజ్యసభ సభ్యుడైన తర్వాత పెట్టిన ఖర్చు చూసి అంతా ఆశ్చర్యపోయారు. తన ప్రమాణస్వీకారానికి ప్రత్యేక విమానాల్లో అనుచరుల్ని ఢిల్లీ తీసుకెళ్లారు.
ఈడీ , ఐటీ దాడులు కేవలం.. వీరిద్దరితోనే ఆగిపోవని.. టీఆర్ఎస్ ముఖ్యనేతలు.. ఆర్థికంగా బలంగా ఉన్న వారందర్నీ టార్గెట్ చేస్తారని అంటున్నారు. వీటన్నింటినీ ఎదుర్కోవడానికే కేసీఆర్ సిద్ధమయ్యారని.. అందుకే ఎలాంటి వ్యూహం అవలంభించాలన్నది నేరుగా దాడులకు గురవుతున్న వారితోనే చర్చలు జరుపుతున్నారు. కమలాకర్, రవిచంద్రలను పిలిపించి మాట్లాడారు. ఎవరెవరు హిట్ లిస్ట్‌లో ఉన్నారో తెలుసుకుని వారిని అలెర్ట్ చేస్తున్నారు. అయితే అరెస్టులు ప్రారంభమైతే మాత్రం రాజకీయంగా అలజడి చోటు చేసుకునే అవకాశం ఉంది.